MAHESH BABU అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సందీప్ తన రెండో సినిమాగా బాలీవుడ్ చిత్రం చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్‌తో కలిసి రీమేక్ చేశాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండగా, కొన్నాళ్లుగా మహేష్ బాబుతో మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే మహేష్.. హవెల్స్ ఎలక్ట్రిక్ బల్బుల యాడ్‌లో నటిస్తుండగా, దానిని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన నటించిన తమన్నా ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఇక ఇప్పుడు హవెల్స్ ఎలక్ట్రిక్ బల్బుల యాడ్ కోసం మహేష్‌తో జతకట్టింది. ఈ రోజు షూట్ మొదలు కాగా, ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై క్లారిటీ లేదు. కాగా, మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.