Mahesh Babu: స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ నోటీస్‌.. ఫ‌స్ట్ లుక్‌తో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్

Mahesh Babu: స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. దుబాయ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. దుబాయ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఈ చిత్ర యూనిట్‌ జూలై 12న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణను మొదలు పెట్టింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ జూలై 31న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అన్న‌ట్టుగానే కొద్ది సేప‌టి క్రితం మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేష్ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. రెడ్ క‌ల‌ర్ కారు నుండి దిగుతున్న‌ట్టుగా మ‌హేష్ క‌నిపిస్తున్నాడు.ఈ పోస్టర్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మ‌రోవైపు ఈ పోస్ట‌ర్ ద్వారా చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌కటించారు. ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుండ‌గా, ఒక రోజు ముందు స‌ర్కారు వారి పాట విడుద‌ల అవుతుంది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌హేష్‌, ప్ర‌భాస్ ఫైటింగ్ ఆసక్తిక‌రంగా మార‌నుంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ కూడా సంక్రాంతికి రానుంది. ఎఫ్ 3 చిత్రం కూడా అదే స‌మ‌యంలో రిలీజ్ అవుతుంది. ఈ నాలుగు సినిమాల మ‌ధ్య బిగ్ ఫైట్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది.

ఇక ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ఉండ‌డంతో ఆ రోజున సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా టీజ‌ర్ లేదంటే పాటను రిలీజ్ చేయ‌నున్నారు.మైత్రీ మూవీస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.

సోషల్ మెసేజ్‌తో వస్తున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.