Mahesh Babu: చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి: మ‌హేష్ బాబు

Mahesh Babu: సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘ‌ట‌న ఎంత మందిని క‌లిచివేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అభం శుభం తెలియ‌ని చిన్నారికి మాయ మాట‌లు చెప్పి త‌న రూంకి తీసుకెళ్లి హ‌త్యాచారం చేశాడు రాజు అనే దుండ‌గుడు. అత‌డిని ఉరి వేసి చంపాల‌ని , ఎన్‌కౌంట‌ర్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చిన్నారి చ‌నిపోయి ఐదు రోజులు అవుతున్నా కూడా రాజ‌కీయ నాయ‌కులు కాని సినీ సెల‌బ్రిటీలు కాని స్పందించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Mahesh Babu

ఈ క్ర‌మంలో ఈ రోజు మంచు మ‌నోజ్ బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.T ఇక టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు.

ఇక మంత్రి మ‌ల్లారెడ్డి నిందితుడిని త్వ‌ర‌గా ప‌ట్టుకొని ఆయ‌న‌ని ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఇక కొద్ది సేప‌టి క్రితం నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు సీపీ అంజనీకుమార్‌. రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు.

రాజు ఆచూకీ చెప్పిన వారికి ప‌ది ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. రాజుని అరెస్ట్ చేయాల‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా నిందితుల‌ని అరెస్ట్ చేయాల‌ని అన్నారు. కేసులో ముద్దాయిగా ఉన్న వ్య‌క్తిని త్వ‌ర‌గా అరెస్ట్ చేసి , చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారుల‌ని కోరుతున్నాను అని మహేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.