Mahesh Babu: ల‌వ్ స్టోరీ చిత్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన మ‌హేష్ బాబు

Mahesh Babu: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, తొలి షో నుండే మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

Mahesh Babu Praises the Love Story Team
Mahesh Babu Praises the Love Story Team

ఎన్నో అడ్డంకులను దాటి సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లవ్ స్టోరీ’.. పాండమిక్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది ‘లవ్ స్టోరీ’.. అక్కడ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2021లో యూఎస్ఎ ప్రీమియర్స్‌లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన ఇండియన్ ఫిలింగా ‘లవ్ స్టోరీ’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. రిలీజ్ చేసిన అన్ని లొకేషన్లలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది.

ల‌వ్ స్టోరీ చిత్రం మంచి హిట్ కావ‌డంతో ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లవ్‌స్టోరీ సినిమాని వీక్షించి స్పందించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు గుప్పించాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని అన్నారు. ఇక నటుడిగా నాగ చైతన్య మరింత ఎదిగిపోయాడని, అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు.

సాయిపల్లవి నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి, తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె కదులుతుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అన్నారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు గార్లకి అభినందనలు తెలియచేశారు.