Mahesh Babu : ఎట్టకేలకు మహేష్ బాబుతో జాయిన్ అయిన బుట్ట బొమ్మ
NQ Staff - January 10, 2023 / 08:26 AM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ పూర్తయి చాలా రోజులైంది. రెండవ షెడ్యూల్ ప్రారంభించాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు నెలకొన్నాయి.
అందుకే చిత్రీకరణ ఆలస్యమైంది. ఆ తర్వాత మహేష్ బాబు షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ హీరోయిన్ పూజా హెగ్డే అందుబాటులో లేని కారణంగా మహేష్ బాబు కూడా ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
ఆ మధ్య అన్నట్లుగా జనవరి లో మహేష్ బాబు చిత్రీకరణ మళ్లీ ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు మరియు పూజ హెగ్డే లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికీ రెండు సినిమాలు చేసిన పూజ హెగ్డే ఆ సినిమాలతో సక్సెస్ దక్కించుకుంది.
ఇప్పుడు ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో ఉంది. మహేష్ బాబుతో సినిమా విషయమై పూజ హెగ్డే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మహేష్ బాబు మరియు పూజా హెగ్డే కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కుతున్నట్లుగా త్రివిక్రమ్ కాంపౌండ్ నుండి కూడా ప్రచారం జరుగుతుంది.
అతి త్వరలోనే సినిమా యొక్క ఫస్ట్ లుక్ వస్తుందని సమాచారం. ఈ ఏడాది దసరా సందర్భంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాతో పూజ హెగ్డే మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.