Mahesh babu: అన్న‌య్య మృతితో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన మ‌హేష్ బాబు

Mahesh babu: ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు శ‌నివారం రాత్రి అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతితో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది. కృష్ణ‌, ఇందిర‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు.

mahesh babu offers his condolences to his brother (1)
mahesh babu offers his condolences to his brother (1)

రీసెంట్ గా మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే మహేష్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య…’ అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

“మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు.. నువ్వే నా బలం.. నువ్వు నా ధైర్యం .. నువ్వే నా సర్వస్వం.. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి… విశ్రాంతి…
నాకు మరో జీవితమంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా ఉంటావు. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ తన సోదరుడి మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మహేష్-రమేష్ బాబుల బాండింగ్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. రియల్ లైఫ్ లోనే కాదు..రీల్ లైఫ్ లోను ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించారు. ఇక వ్యక్తిగతంగా అన్నయ్య అంటే మహేష్ కి తండ్రి సమానుడు. తన కెరీర్ ఎదుగుదలలో రమేష్ బాబు ఎంతో కీలక పాత్ర పోషించారని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. మహేష్ ఎదుగుతోన్న వయసులో తన చదువు అన్నయ్య దగ్గరుండి చూసుకునేవారు.

మహేష్ ప్రతీ విషయంలోనూ రమేష్ బాబు ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. అందుకే అన్నయ్యని పెద్ద నిర్మాతని చేయాలని మహేష్ సైతం కలలు కనేవారు. మహేష్ హీరోగా `అర్జున్`..`అతిధి` చిత్రాల్ని రమేష్ బాబు నిర్మించారు. కానీ ఆ రెండు సరైన ఫలితాలు సాధించలేదు. “అన్నయ్య తనతో సినిమా చేస్తానంటే వెంటనే డేట్లు కేటాయిస్తానని.. రమేష్ అన్నయ్య నాతో సినిమా చేస్తానంటే నేను కాదంటనా?“ అని చెప్పుకొచ్చారు. అంత అభిమానం చూపించే తమ్ముడు మహేష్ అన్నయ్యని కడసారి చూపునకు నోచుకోలేని పరిస్థితి ఉందిప్పుడు.