Mahesh Babu : మ‌రో కొత్త వ్యాపారం మొద‌ల పెట్ట‌బోతున్న మ‌హేష్ బాబు

Mahesh Babu : ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలు ఎక్కువ వ్యాపారం మీద దృష్టి సారిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.

Mahesh Babu new business with MNC
Mahesh Babu new business with MNC

తెలుగు లో ఆన్ లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ ని తీసుకు వచ్చే ప్రయత్నం మహేష్ బాబు చేస్తున్నాడని దీనికి సంబంధించి ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నాడని దీంట్లో మహేష్ బాబు దాదాపు వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కీలక అడుగు పడే అవకాశం ఉందని దీంట్లో మహేష్ బాబు తో పాటు ఒక మల్టీ నేషనల్ కంపెనీ కూడా భాగస్వామి అవకాశం ఉందని స‌మాచారం.

మహేష్ బాబు ఉంటే బాగుంటుందని భావనలోనే ఆ కంపెనీ కూడా మహేష్ బాబు ను సంప్రదించటంతో త్వరలోనే దీనికి సంబంధించి ముందడుగు పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మ‌హేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు.

సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్’గా నటిస్తున్నారు.

స‌ర్కారు వారి పాట కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.

వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.