Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్.. ఏం ఉన్నాడ్రా బాబు..!
NQ Staff - March 2, 2023 / 10:30 AM IST

Mahesh Babu : మహేశ్ బాబు ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తండ్రి కృష్ణ చనిపోయినప్పటి నుంచి చాలా కాలంగా ఆయన సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. కానీ రీసెంట్ గానే ఆయన తల్లి, తండ్రి చనిపోయిన బాధ నుంచి తేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తన ఫిట్ నెస్ మీద కూడా దృష్టి పెడుతున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత రాజమౌళితో భారీ సినిమా ఉండబోతోంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేసి రాజమౌళి సినిమాకు షిఫ్ట్ అయిపోవాలని మహేశ్ బాబు భావిస్తున్నారు.

Mahesh Babu Latest Gym Photos
ఇక తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన లుక్ బయటకు వచ్చింది. జిమ్ లో ఆయన కష్టపడుతున్నప్పుడు తీసింది. ఇందులో ఆయన చాలా హ్యాండ్సమ్ లుక్ లో.. అలాగే కరెక్ట్ ఫిజిక్ తో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసి ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

Mahesh Babu Latest Gym Photos
మహేశ్ బాబు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫిజక్ తో కనిపించాడని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.