Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం కాపాడిన మ‌హేష్ బాబు.. ఆనందం వ్య‌క్తం చేసిన న‌మ్ర‌త‌

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టుడిగానే కాదు మంచి సేవాత‌త్ప‌ర‌త ఉన్న వ్య‌క్తిగా ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. తన తండ్రి కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో బుర్రిపాలెంలో చాలా మందికి వ్యాక్సిన్స్ వేయించారు.

mahesh babu

మహేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఈ రెండు ఊర్లను అభివృద్ధి చేసే బాధ్యతలను తన భుజాల మీద వేసుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజమైన శ్రీమంతుడిగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కృషితో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. తన వంతు సాయంగా అందరికీ తోచినంత వైద్యం అందిస్తున్నాడు ఈయన. తాజాగా మరో చిన్నారి ప్రాణం కూడా నిలబెట్టాడు సూపర్ స్టార్. అరుదైన జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న చిన్నారికి ఆప‌రేష‌న్ చేయించాడు. రెండేళ్ల చిన్నారి ఇప్పుడు సంతోషంగా ఉంది.

ఇదే విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.