Mahesh babu : మహేష్ బాబు రెండు పడవల ప్రయాణం .. టాలీవుడ్ అంతా శభాష్ అంటోంది ..!

Mahesh babu : మహేష్ బాబు ఒకవైపు హీరోగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే మరొక వైపు నిర్మాతగా అద్భుతమైన కథలని నిర్మిస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా నుంచి దాదాపు మహేష్ బాబు నటిస్తున్న సినిమాలకి నిర్మాణం లో భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైనమెంట్స్ అన్న పేరుతో నిర్మాణ సంస్థ ని స్థాపించి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న మహేష్ బాబు అదే బ్యానర్ లో సినిమాలని నిర్మిస్తూ యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక బయోపిక్ సినిమాని నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు నమ్రత మహేష్ చూసుకుంటున్నారట.

mahesh-babu-he-is-sailing-in-two-boats-which-is-appreciated-by-everyone-in-tollywood-industry
mahesh-babu-he-is-sailing-in-two-boats-which-is-appreciated-by-everyone-in-tollywood-industry

టాలెంటెడ్ హీరో అడవి శేష్ తో ‘గూఢచారి’ సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీలో ఉన్న విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా. ప్రస్తుతం ఈ దర్శకుడే మహేష్ నిర్మిస్తున్న మేజర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అడవి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తుండగా సోనీ పిక్చర్స్ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరూకుంటోంది. శోబిత ధూళిపాళ్ళ, సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా తాజా ఈ సినిమాని జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అడవి శేష్ లుక్ ని వదిలి ప్రకటించాడు మహేష్ బాబు.

Mahesh babu : టాలీవుడ్ యంగ్ హీరోలతో మహేష్ బాబు సినిమాలని నిర్మించేందుకు సన్నాహాలు..!

ఇక ఈ సినిమా 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలతో కూడా మహేష్ బాబు సినిమాలని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో సాగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇలా మహేష్ బాబు హీరోగా.. యంగ్ టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేస్తూ నిర్మాతగా కొనసాగుతున్నందుకు టాలీవుడ్ లో ప్రముఖులు ప్రశంసిస్తున్నారట.

Advertisement