Mahesh babu : మహేష్ బాబు ఇచ్చింది షాకే అంటున్న ఫ్యాన్స్ ..?

Mahesh babu : మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కరోనా క్రైసిస్ లో అనుకున్న సమయానికి మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ మొదలవలేదు. లాక్ డౌన్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ లాంటి అన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చాయి. కొన్ని సినిమాలు బ్యాలెన్స్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటున్నాయి. ఇక మాస్ మహారాజ రవితేజ అయితే లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు సాంగ్స్ ని కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచాడు.

mahesh-babu-he-gave-shock-says-his-fans
mahesh-babu-he-gave-shock-says-his-fans

అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న మేకర్స్ తమ సినిమాలని వరస బెట్టి రిలీజ్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం రవితేజ కే దక్కుతుంది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ థియేటర్స్ ఓపెన్ అయ్యాక తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీకి ఊపునిస్తే రవితేజ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాడు. దాంతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అయితే ఇన్నాళ్ళు అందరూ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ కోసమే తమ సినిమాలని ప్రకటించకుండా ఆగినట్టు తాజా పరిణామాలను చూసి చెప్పుకుంటున్నారు.

Mahesh babu : సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన మహేష్ ..?

mahesh-babu-he-gave-shock-says-his-fans

గత రెండు రోజులుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలన్నిటి రిలీజ్ డేట్ ని వరస బెట్టి అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తను నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అయితే ఇది చాలామందికి షాక్ కి గురి చేసిందని చెప్పుకుంటున్నారు. 2020 సంక్రాతి కి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చిన మహేష్ బాబు మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. 2021 లో కరోనా కారణంగా ఏ సినిమా లేకపోగా సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ అని డిసైడ్ అయ్యారు. మొత్తంగా మహేష్ నుంచి రెండేళ్ళకి మళ్ళీ సినిమా రిలీజ్ ని ప్రకటించారు. ఇది ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తుందని టాక్.

Advertisement