మహేష్ బాబు ఫాన్స్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన డైరెక్టర్

Advertisement

కొన్ని సార్లు మన నుంచి మనం చెప్పే పాజిటివ్ ఒపీనియన్ కూడా ఎన్నో గొడవలకు దారి తీయవచ్చు, వాటి వళ్ళ చావు బెదురింపులు కూడా రావచ్చు. అయితే అదే సంఘటన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విషయం లో జరగడం తో అసహానినికి గురైన తరుణ్ భాస్కర్ ఈ సంఘటన కి కారణమైన వారి పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలేం జరిగింది ఎందుకు తరుణ్ భాస్కర్ కంప్లైంట్ ఇచ్చాడు.

ఎవరి పైన ఇచ్చాడు అన్న పూర్తి వివరాల్లోకి వెళితే ఆయన మలయాళం సినిమాలు ఎంతో బాగుంటాయి వాటి స్టోరీ లైనింగ్ మన తెలుగు చాలా సినిమాలకంటే బాగుంటాయి అని చెప్తూ మన తెలుగు సినిమాలు కొద్దిగా వెనుక పడ్డాయి. సరిలేరు నీకెవ్వరూ, మరియు మహర్షి వంటి సినిమాల కంటే కూడా మలయాళ సినిమాలు, వాటి కథ లు చాల బాగుంటాయి అన్న తన అభిప్రాయాన్ని ఒక సోషల్ మీడియా ద్వారా తెలుపగా స్పందిచిన మహేష్ బాబు ఫాన్స్ దానిని వేరేలా అర్ధం చేసుకొని తరుణ్ భాస్కర్ పైన అసభ్యకర ప్రచారం చేస్తూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

తరుణ్ భాస్కర్ మేనేజర్ అయినటువంటి వర్కింగ్ లైన్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ. తరుణ్ చెప్పిన దానిలో తప్పేం ఉంది అంటూ మహేష్ బాబు అభిమానులకు సమాధానం ఇచ్చే క్రమం లో వారి మధ్య మాట మాట పెరిగి తరుణ్ భాస్కర్, సాయి కృష్ణ లను ఇద్దరిని ఇష్టమొచ్చినట్లు గా దూషించడమే కాకుండా మిమ్మల్ని చంపేస్తాం… అంటూ త్రెటనింగ్ కాల్స్ చేసి భయపెట్టడం కూడా చేశారు. ఇలా వారి అభిప్రాయాన్ని తెలిపి దానిలోని మీనింగ్ అర్థమయ్యేలా కన్విన్స్ చేయాలనీ చూసినప్పటికీ ఇలా తరుణ్ భాస్కర్ మరియు సాయి కృష్ణ ల పై తప్పుడు ప్రచారాలు చేయడమేమే కాకుండా బెదిరింపులకు పాల్పడడం తో ఇంకా వారికి మాటలలో ఎంత చెప్పిన అర్ధం కాదు.

సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించడం వదిలేసి వయొలెన్స్ చేయడం ఏమి బాగాలేదని ఈ సంఘటన ని గురించిన కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో అంధ చేశారు. అంతే కాకుండా దానితో పాటుగా ఫోన్ చేసి తరుణ్ భాస్కర్ మరియు సాయి కృష్ణ లకు వార్ణింగ్ లు ఇచ్చిన వారి నెంబర్ లను జతచేయడం జరిగింది. పోలీస్ లు దీని పైన కేసు ని ఫైల్ చేసి ఇలా బెదిరింపులకు పాలు పడిన వారి పైన తగిన విధంగా చర్యలు తీసుకుంటాము అని తెలపడం జరిగింది….

ఇలా మొత్తానికి మాములు ప్రజలే కాదే చిన్న పాటి స్టార్ లు కూడా వారి స్టార్ హీరో లను ఏమైనా అంటే వెంటనే ఇలా రంగం లోకి దిగి ఎంత దూరం అయినా వెల్తూ చివరికి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూ లలో ఆడియో ఫంక్షన్ లలో మా పైన మా సినిమాలను ప్రేమించే అంత అభిమానం ఉంటె చాలు.. గొడవలు పెట్టుకొనేంత వద్దు అని చెప్తున్నప్పటికీ… అభిమాన హీరో లను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వినకుండా వారి అభిమానులు వేంటనే గొడవల్లోకి దిగిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here