మహేష్ బాబు ని తక్కువ చేసి మాట్లాడినందకు ఆయన ఫాన్స్ ఎం చేశారో తెలుసా

Advertisement

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మహేష్ బాబు పైన చేసిన వ్యాఖ్యలు అతని అభిమానులకు ఎంతగానో నొప్పించడం తో సీరియస్ అయిన మహేష్ అభిమానులు తరుణ్ భాస్కర్ ని మరియు అతనికి సపోర్ట్ చేసిన అతని స్నేహితుడు లైన్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ కి వార్నింగ్ లు ఇవ్వడమే కాకుండా ఫోన్ లు చేసి బెదిరింపులు కూడా ఇవ్వడం జరిగింది.. అసలు ఎం జరిగింది.

అంతలా మహేష్ బాబు ఫాన్స్ విరుచుకుపడడానికి కారణం ఏంటి తరుణ్ భాస్కర్ చేసిన వాక్యలు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే.. తరుణ్ భాస్కర్ కి మలయాళం సినిమాలు అంటే ఎంతగానో ఇష్టం ఆ విషయాన్నే తెలియచేస్తూ ఆయన మలయాళం సినిమాలు ఎంతగానో బాగుంటాయి. మహేష్ బాబు చివరిగా తీసిన సరిలేరు నీకెవ్వరూ, మహర్షి సినిమాల కన్నా కూడా బాగుంటాయి అంటూ తన ఒపీనియన్ ని తెలియ చేస్తూనే మహేష్ బాబు సినిమాలని తక్కువ చేసి మాట్లాడాడు.

దానిలో ఎంత నిజం ఉన్నది పక్కకు పెడితే ఆ విషయం పైన మహేష్ బాబు అభిమానులు ఒక రేంజ్ లో అతని పైన అసభ్యకర పాద జాలం వాడి వార్ణింగ్ లు ఇచ్చే రేంజ్ లో రీట్వీట్ లు చేసేసారు . అయితే తరుణ్ భాస్కర్ చెప్పిన విషయం లో తప్పేముంది అంటూ లైన్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ. అందరి జీవితం లో వారికేం అనిపించిందో చెప్పుకొనే ఫ్రీడమ్ అవకాశాలు ఉన్నాయి. అని ఒక వైపు తన మద్దతు తరుణ్ భాస్కర్ కి ఇస్తూనే మహేష్ బాబు ఫాన్స్ ఇచ్చినటువంటి ట్వీట్ లకు సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టడం తో మాటలు కాస్త పెద్ద వివాదంగా మారాయి. ఎంతలా అంటే అతని నెంబర్ కనుక్కొని మరి అతనికి ఫోన్ చేసి బెదిరించే అంతలా.

ఆ విధంగా అతనికి చాల మంది నుండి బెదిరింపులు ఎదురవ్వడం తో చేసేదేమి లేక భయపడిన సాయి కృష్ణ సైబరాబాద్ పోలీస్ లను టాగ్ చేసి నాకు ఇలా బెదిరింపులు వచ్చాయి అంటూ తన బాధని వ్యక్త పరిచాడు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ లు ఆ కేసు ని దర్యాప్తు చేపట్టి దానికి కారకులైన వారి పైన దానికి తగ్గ శిక్ష పడేలా చేస్తాము అంటూ తెలిపారు. ఆ విధంగానే ఇటీవల ఒక ప్రముఖ హీరోయిన్ నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు నేను మహేష్ ఫ్యాన్ అని తెలిపినందుకు గాను ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో దూషించడమే కాకుండా బెదిరింపులు కూడా ఇవ్వడం జరిగింది.

ఇలాంటి సంధర్బాలన్నీ గమనిస్తే స్టార్ హీరో ల విషయం లో చిన్న మాట అన్న ఆ హీరో అభిమానులు అంత ఈజీ గా తీసుకోకుండా అల్లకల్లోలం సృష్టిస్తారు అని అర్ధం అవుతుంది. అయితే చాలా సార్లు కూడా అలంటి స్టార్ హీరో లు కూడా మీ అభిమానం సినిమాల వరకే ఉంచండి ..వాటిని పర్సనల్ గా తీసుకొని వివాదాలు సృష్టించవద్దు అని తెలిపినప్పటికీ అభిమానులు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here