Mahesh Babu: ఓటింగ్‌కు డుమ్మా కొట్టిన మ‌హేష్‌..పిల్ల‌లతో క‌లిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సూప‌ర్ స్టార్

Mahesh Babu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ ,బాలకృష్ణతో పాటు నాగార్జున వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సెల‌బ్స్ వ‌చ్చి త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.మ‌హేష్ బాబుతో పాటు మ‌రి కొద్ది ప్ర‌ముఖులు ఓటింగ్‌కి రాక‌పోవ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాస్త ఖాళీ సమయం దొరికినా సరే కుటుంబంతో సహా వెకేషన్‌కు వెళుతుంటారు మ‌హేష్‌. ముఖ్యంగా కుటుంబసభ్యులతో విదేశాలను సందర్శిస్తుంటారు. నమ్రతతో పాటు పిల్లలు సితార, గౌతమ్ అందరూ కలిసి టూర్స్‌ వేస్తుంటారు. ఈ క్రమంలోనే కుటుంబంతో గడిపిన క్షణాలను నటి నమ్రతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్‌. తాజాగా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా స్పెయిన్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.

గోవా, హైదరాబాద్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం అక్టోబర్‌ 1న స్పెయిన్‌ వెళ్లారు. అక్క‌డ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. తాజాగా మ‌హేష్ త‌న పిల్ల‌లతో క‌లిసి సంద‌డి చేస్తున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ పిక్ చూసి ది ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవ‌ల న‌మ్ర‌త కూతురు సితారతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేసి .. ‘మధుర జ్ఙాపకాలను సొంతం చేసుకోవడానికి మరో టూర్‌కు వెళుతన్నాం. స్పెయిన్‌ మేము వచ్చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. మొత్తానికి మహేష్‌ బాబు ఓవైపు షూటింగ్‌ను మరోవైపు ఫ్యామిలీ హాలీడేను కూడా పూర్తి చేస్తున్నట్లు అర్థమవుతోంది. మహేష్‌ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.