Mahesh babu : మహేష్ బాబు అలా చేస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు..!

Mahesh babu : మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవడమే కాదు మరీ రెండేళ్ళు గ్యాప్ వచ్చినందుకు తెగ ఫీలవుతున్నారు కూడా. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉగాది రోజున మొదలైన సెకండ్ షెడ్యూల్ 25 రోజులు జరపనున్నారట.

mahesh-babu-creates-new-records-if-this-happens
mahesh-babu-creates-new-records-if-this-happens

ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీపోండ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ముందు అనుకున్నట్టు 2022 సంక్రాంతికి కాకుండా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే థమన్ 3 పాటలు పూర్తి చేశాడు. మరో రెండు పాటలు పూర్తి కావాల్సి ఉందని ఇటీవలే వెల్లడించాడు.

Mahesh babu : విజయ దశమి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట..!

సర్కారు వారి పాట సినిమాలో మొత్తం 5 పాటలున్నాయట. కాగా విజయ దశమి పండుగ సందర్భంగా అన్నీ అనుకున్నటు పూర్తయితే సర్కారు వారి పాట అక్టోబర్‌లో భారీ స్థాయిలో రిలీజ్ అవడం ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే మహేష్ అభిమానుల ఆనందానికి అవధులుండవు. అంతేకాదు సరిలేరి నీకెవ్వరు తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేటవడం కూడా గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి సర్కారు వారు ఎప్పుడు వస్తారో.

Advertisement