Mahesh babu: సౌతిండియాలో ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక హీరో మ‌హేష్‌..!

Mahesh babu: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న మ‌హేష్ బాబు ప‌లు రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న మ‌హేష్ .. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న‌దైన శైలిలో అల‌రిస్తూ ఉంటాడు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా ఎవరు కష్టపడి మంచి సినిమా చేసినా కూడా మహేష్ బాబు చాలా పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

mahesh babu creates new record1
mahesh babu creates new record1

రీసెంట్‌గా అఖండ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. 2010లో ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన మహేష్ బాబు వన్ మిలియన్ ఫాలోవర్స్ ను అందుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. 2016లో 2 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న మహేష్ 2017 లో ఒక్కసారిగా 5 మిలియన్ ఫాలోవర్స్ మార్కును అందుకున్నాడు. ఇక 2020లోకి వచ్చేసరికి 11 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్నారు.

ఇక 2021 మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ కు చేరుకుంది. ఈ నెంబర్ తో మహేష్ టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అత్యదిక మంది ఫాలో అవుతున్న నెంబర్ వన్ హీరోగా రికార్డును అందుకున్నాడు. దీంతో మహేష్ బాబు పేరు సోషల్ మీడియా లో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇక సూపర్ స్టార్ అభిమానులు రికార్డుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను క్రియేట్ చేసి అది కూడా ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

మహేష్ బాబు తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 10.32 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మూడవ స్థానంలో సూర్య 7.34 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. అనంతరం కమల్ హాసన్ 7M , రజనీకాంత్ 6M ఫాలోవర్స్ తో తరువాత స్థానాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అగ్ర హీరోలు మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.

mahesh babu creates new record
mahesh babu creates new record

ఇదిలా ఉంటే స‌ర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి మైనర్ గాయమయినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఇప్పటికే మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదట.