Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు క‌న్నుమూత‌

Ramesh Babu: ఘ‌ట్ట‌మ‌నేని ఇంట్లో విషాదం నెల‌కొంది. సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు (56) కొద్ది సేప‌టి క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసారు. కాలేయ వ్యాధి సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Mahesh Babu Brother Ramesh Babu is No more
Mahesh Babu Brother Ramesh Babu is No more

అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియ‌డంతో ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 1997 నుండి న‌ట‌ను దూరంగా ఉంటున్న ర‌మేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు వంటి సినిమాల్లో బాల నటుడిగా రమేష్ బాబు నటించారు. ఆ తరువాత సామ్రాట్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోగా మాత్రం రమేష్ బాబు నిలదొక్కుకోలేకపోయారు.

రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కలిసి ఎన్నో చిత్రాల్లోనటించారు. ఇక మహేష్ బాబు, రమేష్ బాబు, కృష్ణ కూడా కలిసి నటించారు. హీరోగా రమేష్ బాబు సరైన విజయాలు అందుకోలేకపోయినా కూడా నిర్మాతగా మహేష్ బాబు సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. అర్జున్, అతిథి వంటి సినిమాలను నిర్మించారు. దూకుడు సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు.

Mahesh Babu Brother Ramesh Babu is No more
Mahesh Babu Brother Ramesh Babu is No more

15 చిత్రాల‌లో న‌టించిర ర‌మేష్ బాబు 1974లో వ‌చ్చిన అల్లూరి సీతారామ‌రాజు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న కు మ‌హేష్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఇటీవ‌ల త‌న అన్న బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ర‌మేష్ బాబు మృతితో సినిమా ఇండ‌స్ట్రీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.