Mahesh babu : మహేశ్ బాబు ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసుకునే న్యూస్ వచ్చేసింది , ఎప్పటినుంచో వెయిటింగ్ వాళ్ళంతా పాపం !
Vedha - February 3, 2021 / 11:34 AM IST

Mahesh babu : మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తండ్రి సూపర్ స్టార్ కి తగ్గ తనయుడిగా మహేష్ బాబు క్రమ శిక్షణలోనూ సినిమాల ఎంపిక లోనూ గొప్ప పేరును సంపాదించుకున్నాడు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులు ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడో అందరు ఎదురు చూస్తుంటాయి. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో డైలాగ్ డెలవరీ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులని సంపాదించుకున్నాడు. వరస సక్సస్ ల మీద ఉన్న మహేష్ బాబు గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన “సరిలేరు నీకెవ్వరూ” బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది.

mahesh-babu-an-amazing-news-for-his-fans
ఈ క్రమంలో ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా దుబాయ్ లో షూటింగ్ మొదలైంది. నాన్ స్టాప్ గా నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇలా మహేష్ బాబు షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేశాడు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో సర్కారు వారి పాట సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ని రిలీజ్ చేసి మేకర్స్ ప్రకటించారు.
Mahesh babu : మహేశ్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుంది..!
ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ తో కొన్ని రొమాంటిక్ లవ్ సీన్స్, అలాగే కొన్ని ఛేజింగ్ సీన్స్, వీటితో పాటు రెండు పాటలని కూడా కంప్లీట్ చేస్తారట. కాగా ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తిసురేష్ ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఓ పాటని కూడా ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ లవ్ సీన్స్ లోనే సాంగ్ లో వచ్చే కిక్ ఉంటుందని అంటున్నారు. ఇక తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగం లో జరిగే అవినీతి .. మోసాలపై సినిమా కథ సాగుతుందని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు.