Mahesh Babu : నా కూతురుకి ఆ సీన్స్ న‌చ్చ‌వు : మ‌హేష్ బాబు

NQ Staff - December 4, 2021 / 05:50 PM IST

Mahesh Babu : నా కూతురుకి ఆ సీన్స్ న‌చ్చ‌వు : మ‌హేష్ బాబు

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు అనే సంగ‌తి తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసిన పోస్టులు కొన్ని నిమిషాల్లోనే ట్రేండింగ్ లిస్టులో చేరుతున్నాయి.

Mahesh Babu about his daughter Sitara

Mahesh Babu about his daughter Sitara

ఈ క్ర‌మంలోనే 2021 మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ కు చేరుకుంది. ఈ నెంబర్ తో మహేష్ టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అత్యదిక మంది ఫాలో అవుతున్న నెంబర్ వన్ హీరోగా రికార్డును అందుకున్నాడు. దీంతో మహేష్ బాబు పేరు సోషల్ మీడియా లో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇక సూపర్ స్టార్ అభిమానులు రికార్డుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను క్రియేట్ చేసి అది కూడా ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

Mahesh Babu about his daughter Sitara

Mahesh Babu about his daughter Sitara

త్వ‌ర‌లో మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా ఓ ఆంగ్ల ప‌త్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబుకు ప్ర‌శ్న ఎదురైంది. ఒక హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా విలన్‌లతో పోరాడుతున్నప్పుడు పిల్లలు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. దీనిపై మహేష్ స్పందిస్తూ..యాక్షన్ పార్ట్ వారికి నచ్చదు. ఫైట్ సన్నివేశం వచ్చినప్పుడల్లా, నా కుమార్తె బ‌య‌ట‌కు వెళుతుంది అని చెప్పాడు.

మహేష్ తన ప్రతి సినిమాని విడుదలైన మొదటి రోజు తన ఇంట్లో కుటుంబంతో కలిసి చూస్తాడు.అదొక అద్భుత‌మైన అనుభ‌వంగా ఆయ‌న భావిస్తాడు. క‌ష్ట‌ప‌డి వ‌చ్చి, పిల్ల‌ల‌తో క‌లిసి సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరుంటుంది అని అన్నాడు. ఇటీవ‌ల మ‌హేష్ బాబుకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహేష్ బాబు మోకాలికి సర్జరీ నిమిత్తం అమెరికా పయనం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు తాజా సినిమా సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి మైనర్ గాయమయినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఇప్పటికే మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us