Mahesh Babu: స‌ర్కారు వారి పాట సెట్‌లో పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ బాబు

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఫ్యామిలీతో తెగ సంద‌డి చేస్తున్నాడు. స‌ర్కారు వారి పాట చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులోకీర్తి సురేష్ క‌థానాయిగా న‌టిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్.

TheNewsQube-
mahesh-at-sarkaaru-vaari-pa
mahesh-at-sarkaaru-vaari-paata set

 

ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. ఇక ఇప్పటికే దుబాయ్, గోవాలో షూటింగ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో స్పెయిన్‌‌‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది. సర్కారు వారి పాట షూటింగ్ మొదలు అయినప్పటి నుండి మహేష్ బాబు లుక్, అలాగే ఆయన పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

సర్కారు వారి పాట కోసం భారీ సెట్ వేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, అందులో మ‌హేష్ బాబు ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి సంద‌డి చేస్తున్నాడు. పిల్ల‌ల‌తో సెట్‌ని చూస్తూ మురిసిపోయాడు మ‌హేష్. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్టు సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ మహేశ్‌బాబుతో దిగిన ఫొటోని పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 సంక్రాంతికి సందడి చేయనుంది.

స‌ర్కారు వారి పాట చిత్రానికి మ‌హేష్ 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నాడ‌ని అంటున్నారు. సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన క్షణాల్లోనే రికార్డుల వేట మొదలు పెట్టింది. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ఇప్పటి వరకు 38మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌‌‌‌లో ట్రెండింగ్‌‌‌‌లో కొనసాగుతోంది.