Maha Samudram Review: మహా సముద్రం సినిమా రివ్యూ..

Maha Samudram Review: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో వినూత్నమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. తన రెండో సినిమా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశ్యంతో ఎంతో వైవిధ్యమైన కథ, కథనాల్ని తెరకెక్కించిన సినిమా మహాసముద్రం. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Maha samudram Review and Rating
Maha samudram Review and Rating

కథ:

అర్జున్, విజయ్ లు ఇద్దరూ మంచి స్నేహితులు. హీరోకి మహాతో రిలేషన్ ఏర్పడుతుంది. వరుసగా జరిగే కొన్ని అనుకోని సంఘటనలతో విజయ్ సిటీ నుండి పారిపోవాల్సి వస్తుంది. తన ఆచూకీ కోసం అర్జున్ ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అతను ఎక్కడున్నాడనేది కూడా ఎవరికీ తెలీదు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత విజయ్ తిరిగి వస్తాడు. అసలు విజయ్ పారిపోవడానికి, తిరిగి రావడానికి కారణాలేంటో.. అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తన ఫ్రెండ్ అయిన అర్జున్, విజయ్ కు ఏ విధంగా హెల్ప్ అయ్యాడనేది తెలియాలంటే మహా సముద్రం సినిమా చూడాల్సిందే.

Maha samudram Review and Rating
Maha samudram Review and Rating

నటీనటుల నటన :

శర్వానంద్ మరియు సిద్ధార్థ్ లు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినూత్నమైన పాత్రలతో పూర్తి స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ని అందించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అదితిరావు హైదరికి ఆకట్టుకునే పాత్రను అందించారు. ఆమె కూడా తనకు క్రియేట్ చేసిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేసింది. అను ఇమ్మాన్యుయేల్ కూడా ఎంతో చక్కగా తన అభినయాన్ని చూపించింది. ఈ సినిమాకి మరో హైలెట్ పాత్ర అయిన జగపతిబాబు, రావు రమేష్ లు కూడా ఎంతో ఉన్నతంగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంది.

టెక్నీషియన్స్ :

డైరెక్టర్ అజయ్ భూపతి అద్భుతమైన ఓ అంశాన్ని సెలెక్ట్ చేసుకుని అందుకు సరిపోయే పాత్రలను సెలెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్స్ తో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో బ్యాలెన్స్ గా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా ఎంతో అద్భుతంగా యాక్షన్ ఒరియెంటెడ్ బ్యాంగ్స్ తో అంతకు మించిన ట్విస్టులతో క్రియేట్ చేశాడు. అయితే ఈ పార్ట్ లోనే డైరెక్టర్ గా కొన్ని సీన్స్ లో తన పట్టుకును కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ ఎంతో చక్కగా ఉంటుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మ్యూజిక్ వల్లే హిట్ అయ్యిందనే విషయం ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంది. దీంతో పాటు ఎడిటింగ్ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు.

Maha samudram Review and Rating
Maha samudram Review and Rating

విశ్లేషణ :

మహా సముద్రం రెండు విభిన్నమైన వ్యక్తిత్వాల కథ. సినిమా స్టార్టింగ్ లో ప్రేక్షకుల అంచనాలకు తగిన రీతిలో ఉన్న సీన్స్ ని ఇంటర్వెల్ ట్విస్ట్ తో క్యారీ చేయడం బావుంటుంది. కానీ అన్ని అంచనాలతో చూస్తున్న ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ లో నిరాశ కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరి ల యాక్టింగ్,
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ హాఫ్
  • స్క్రీన్ ప్లే
  • యాక్షన్, భావోద్వేగాలు అనుకున్న రీతిలో రాకపోవడం.

చివరగా : శర్వానంద్, సిద్ధార్థ్ లు మహాసముద్రాన్ని జయించగలిగారు.

రేటింగ్: 2.75/5