Maha Samudram: మ‌హా స‌ముద్రం నుండి క్రేజీ అప్‌డేట్‌..స్ట‌న్నింగ్ లుక్‌లో అదితి రావు

Priyanka - April 12, 2021 / 11:38 AM IST

Maha Samudram: మ‌హా స‌ముద్రం నుండి క్రేజీ అప్‌డేట్‌..స్ట‌న్నింగ్ లుక్‌లో అదితి రావు

Maha Samudram శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హా స‌ముద్రం. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రం నుండి శ‌ర్వానంద్ లుక్ విడుద‌ల చేసిన నిర్మాత‌లు తాజాగా మహా అనే అమ్మాయి పాత్రలో నటిస్తోన్న అదితిరావు హైదరి లుక్‌ను విడుదల చేసింది.

అదితిరావు హైద‌రి పాత్ర ఆత్మలాంటిద‌ని, ఈమె పాత్ర సినిమాపై ఆస‌క్తిని పెంచేలా ఉంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. అప‌రిమిత‌మైన ప్రేమ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ కాగా, ఇందులో హీరో హీరోయిన్స్ మ‌ధ్య స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతినిస్తాయ‌ని తెలుస్తుంది. రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్నఈ చిత్రానికి . చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత సిద్ధార్థ్ మ‌హా సముద్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుండ‌గా, ఈ సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us