Adipurush : ‘ఆదిపురుష్’కి షాక్.! హనుమంతుడి పాత్రపై హోంమంత్రి అల్టిమేటం.!

NQ Staff - October 4, 2022 / 01:26 PM IST

Adipurush : ‘ఆదిపురుష్’కి షాక్.! హనుమంతుడి పాత్రపై హోంమంత్రి అల్టిమేటం.!

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది. సినిమాలోని హనుమంతుడి పాత్రపై ఏకంగా హోంమంత్రి, చిత్ర యూనిట్‌కి అల్టిమేటం జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, మధ్య ప్రదేశ్ హోం మంత్రి, ‘ఆదిపురుష్’ సినిమా టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కి అల్టిమేటం జారీ చేయడమైంది. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు మధ్యప్రదేశ్ హోంమంత్రి.

అసలేమయ్యిందంటే..

హనుమంతుడి పాత్రకి లెదర్ వస్త్రాల్ని ఆపాదించారు ‘ఆదిపురుష్’ మేకర్స్. హనుమంతుడు అతి బలవంతుడు.. అదే సమయంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలూ వుండవ్. సాధారణ వస్త్రమే ధరించి కనిపిస్తాడు పురాణాల్లోని హనుమంతుడు.

అలాంటి హనుమంతుడికి ఏకంగా లెదర్ జాకెట్ లాంటిది అతికించేశారు ‘ఆదిపురుష్’ మేకర్స్. పైగా, హనుమంతుడి పాత్రని డిజైన్ చేసిన తీరు ఇస్లాంని ప్రతిబింబించేలా వుందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హనుమంతుడి పాత్రకు చేసిన డెకరేషన్స్ తొలగించాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి, ‘ఆదిపురుష్’ దర్శకుడికి లేఖ రాశారు.

ఆంజనేయుడి పాత్రనొక్కదాన్నీ ఇప్పటికిప్పుడు మార్చితే సరిపోదు. ఎందుకంటే, సినిమాలో హనుమంతుడిది అత్యంత కీలకమైన పాత్ర. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రాముడు, సీత, రావణుడి పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us