Madhura Wines: మ‌ధుర వైన్స్ రివ్యూ

Madhura Wines: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జ‌య కిషోర్ తెర‌కెక్కించిన చిత్రం మ‌ధుర వైన్స్. కార్తీక్ రోడ్రిగ్విజ్, జయ్ క్రిష్ చిత్రానికి సంగీతం అందించారు. రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు చిత్రాన్ని నిర్మించారు.ఈ రోజు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..!

Madhura Wines

 

కథ :

అజయ్ (సన్నీ నవీన్) మధురను ప్రేమిస్తాడు. అయితే ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో ఆమె ప్రేమ మత్తులో పడి అజయ్ ఫుల్ గా తాగుతూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో అంజలి (సీమా చౌదరి) అజయ్ ను చూసి ప్రేమిస్తుంది. ఆ ప్రేమ అంజలి అన్నయ్య (సమ్మోహిత్) కు ఇష్టం ఉండదు. ఒక తాగుబోతుకు తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి అతను వ్యతిరేకిస్తాడు.

మధురతో అజయ్ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఇష్టం లేకపోయినా మధుర వైన్స్‌ను ఆనంద రావు ఎందుకు ప్రారంభించారు. అజయ్, అంజలి ప్రేమను ఆనంద్ రావు ఎందుకు నిరాకరించాడు? అంజలితో ప్రేమ విషయంలో ఆనందరావును అజయ్ ఒప్పించాడా? తన చెల్లెలి ప్రేమను అజయ్ ఒప్పుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మధురవైన్స్ సినిమా కథ.

న‌టీన‌టుల న‌ట‌న‌: ఈ సినిమాలో హీరోగా నటించిన సన్నీ నవీన్ నటన పరంగా చక్కగా నటించాడు. తన మొదటి సినిమా అయినా నటనలో అతను చాలా ఈజ్ తో యాక్ట్ చేశాడు. అయితే కీలక పాత్రలో నటించిన సమ్మోహిత్ నటనే సినిమాకి ప్లస్ అయింది. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా సమ్మోహిత్ బాగా నటించాడు. హీరోయిన్ సీమా చౌద‌రి అందంగా కనిపిస్తూ అల‌రించింది. సినిమాలో హీరోకి తండ్రిగా కనిపించిన నటుడు, అలాగే హీరోకి ఫ్రెండ్ పాత్రలో నటుడు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియ‌న్స్: మోహన్ చారి.సిహెచ్ సినిమాటోగ్రఫీ బాగాలేదు. సినిమాలోని కొన్ని కీలక దృశ్యాలను కూడా కెమెరామెన్ సమర్ధవంతంగా చిత్రీకరించలేకపోయాడు. సంగీత దర్శకులు కార్తీక్ రోడ్రిగ్వెజ్, జయ్ క్రిష్ లు అందించిన సంగీతం విషయానికి వస్తే.. కొన్ని పాటలు పర్వాలేదనిపస్తాయి. ఎడిటర్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టు ఉన్నాయి.

విశ్లేష‌ణ‌: మధురవైన్స్ సినిమా కథను ఎత్తుకోవడమే పేలవంగా కనిపిస్తుంది. నాసిరకం స్క్రీన్ ప్లేతో తాగుడు వ్యవహారం వెగటుపుట్టేలా సాగుతుంది. కథ ఓ గమ్యం లేకుండా సాగడం అసహనానికి గురిచేస్తుంది. ఫస్టాఫ్‌లో అజయ్, అంజలి రొమాంటిక్ సీన్లే తప్ప పెద్దగా ఆకట్టుకొనే అంశాలు ఏమీ కనపించవు. కథను బలంగా డ్రైవ్ చేసే అంశాలు ఒక్కటిగా కనిపించవు. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

ప్ల‌స్ పాయింట్స్:

స‌న్నీ న‌వీన్, సీమా చౌదరి న‌ట‌న‌

భావోద్వేగ స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్ :

నాసిర‌కం స్క్రీన్ ప్లే
సహజత్వం చాలా వరకు లోపించడం

చివ‌రిగా: సినిమా కథాంశం బాగుంది. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్, బోరింగ్ ట్రీట్మెంట్ .కొన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొడుతుంది.