Madhavi Latha: రేప్ చేస్తామంటూ హీరోల ఫ్యాన్స్ బెదిరింపులు.. గ‌ట్టిగా ఇచ్చిన మాధ‌వీ ల‌త‌

Madhavi Latha:న‌టి, పొలిటీషియ‌న్ మాధ‌వీ ల‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో పాటు హోస్ట్ నాగార్జున‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది.తాజాగా హీరోల ఫ్యాన్స్ రేపులు చేస్తామంటూ బెదిరిస్తున్నార‌ట‌. దీనిపై స్పందిస్తూ ఘాటుగా మాట్లాడింది మాధ‌వీ ల‌త‌. బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ వీజే సన్నీకి సపోర్ట్‌గా నిలిచిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రోహిణి, కార్తీక దీపం సీరియల్ ఉమాదేవిని కొందరు హీరోల ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నా నోటిసుకు వచ్చింది.

madhavi latha warns fans2
madhavi latha warns fans2

జబర్దస్త్ కమెడియన్ రోహిణి తన యూట్యూబ్ ఛానెల్‌ రౌడీ రోహిణిలో వీజే సన్నీకి సపోర్టుగా నిలవడంపై ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని హీరోయిన్ మాధవీలత తన వీడియోలో వెల్లడించింది. ఇక కార్తీకదీపం సీరియల్‌ ఫేమ్, తాజా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవిని కూడా రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు.

మేము సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌మి. మా జోలికి వస్తే రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట. ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్లు ఫ్యాన్స్ ఎలా అవుతారు. అప్పుడు మిమ్మల్ని మేము ఏమంటామో తెలుసా? మీ హీరోలు అలా ఉన్నందుకే.. మీరు ఇలా చిల్లరగా మారారని అంటాం అని మాధవీలత ఘాటుగా స్పందించారు.

madhavi latha warns fans1
madhavi latha warns fans1

ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే మాకు నచ్చలేదు అని హుందాగా వ్యవహరించాలి. అంతేకానీ రేప్ చేస్తాం. మీ అంతు చూస్తామని ఆడవాళ్లపై ప్రతాపం చూపితే.. మిమ్మల్ని చిల్లర వాళ్లుగా ట్రీట్ చేస్తాం. ఆడవాళ్లను దూషించే మీరు ఒకడికే పుట్టారా? ఒకడికి పుట్టని వాళ్లే ఇలాంటి ఆడవాళ్లపై చిల్లర వ్యాఖ్యలు చేస్తుంటారు అని మాధవీలత అన్నారు.