Madhavi Latha: సిరి ఆడ‌దే కాదంటూ శివాలెత్తిపోయిన మాధ‌వీ ల‌త‌…!

Madhavi Latha: హీరోయిన్‌గా అంతంత మాత్ర‌మే అల‌రించిన మాధ‌వీ ల‌త ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూ ఉంటుంది. ఈ మ‌ధ్య ఆమె బిగ్ బాస్ పై ఎక్కువ ఆస‌క్తి చూపుతుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోని తాజా పరిస్థితులపై, హోస్ట్‌ నాగార్జునపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్‌ చేసుకునే స్థాయిలో బిగ్‌బాస్‌, హోస్ట్‌ నాగార్జున అవమానించారని ఆరోపించింది.

madhavi latha fire on siri1
madhavi latha fire on siri1

తాజాగా షణ్ముఖ్-సిరిల వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. దీంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ కూడా కామెంట్లతో చుక్కలు చూపిస్తున్నారు. వీరిరువురి మధ్య గొడవ తారా స్థాయికి చేరడంతో మరోసారి మాధవీలత.. షణ్ముఖ్-సిరిలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బుధవారం నాటి రాత్రి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో సన్నీ వర్సెస్ సిరిల మధ్య పోటీ పడింది. అయితే సిరికి పర్సనల్ ప్రాబ్లమ్ (పీరియడ్స్) ఉండటంతో వాటర్‌లో దిగే టాస్క్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రవి ద్వారా బిగ్ బాస్‌ని కోరింది. అయితే దయతలచిన బిగ్ బాస్.. స్విమ్మింగ్ పూల్ టాస్క్‌ అయితే మార్చలేదు కానీ.. సిరికి బదులుగా వేరే వాళ్లు ఎవరైనా ఆడొచ్చని.. వాళ్లు గెలిస్తే సిరి గెలిచినట్టే అని చెప్పారు బిగ్ బాస్.

madhavi latha fire on siri2
madhavi latha fire on siri2

అయితే సిరికి బదులుగా పోట్లాడాలంటే షణ్ముఖ్ సర్రుమని వస్తాడు కానీ.. ఇది ఫిజికల్ టాస్క్ అందులోనూ మనోడికి సరిగా ఈత రాకపోవడంతో మానస్ సాయం కోరారు. హౌస్‌లో మానస్ అలా.. మానస్ ఇలా అని నోరు పారేసుకుంటూ ఉంటుంది సిరి. అయితే అవసరం పడటంతో అవన్నీ పక్కనపెట్టేసి.. సన్నీకి క్లోజ్‌గా ఉండే మానస్ సాయం కోరింది.

మానస్ పేరు చెప్పారంటే అది సన్నీని దెబ్బ కొట్టేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ అని స్పష్ఠంగా తెలుస్తూనే ఉంది. మానస్ నేను నీ తరుపున ఆడనని చెప్పి ఉంటే.. మానస్‌కి మానస్ అయ్యేది. దాన్ని సిరి తనకి అనుకూలంగా మార్చుకుని సింపథీ కొట్టేసేది. కానీ మానస్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు.. తనని ఎన్ని తిట్టుకున్నా.. ఆ పాత గొడవల్ని పక్కన పెట్టి రెండో ఆలోచన లేకుండా సన్నీకి పోటీగా నీ తరుపున నేను ఆడతా అన్నాడు.

టాస్క్ ప్రకారం స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి.. అవతల ఉన్న టీ షర్ట్‌ని సరిగా ధరించాలి. ఎక్కువ టీషర్టులు ఎవరు ధరిస్తే వాళ్లు గెలిచినట్టు. సో సన్నీ.. మానస్ కంటే ఎక్కువ టీ షర్ట్స్ ధరించాడు. అయితే సంచాలకుడిగా ఉన్న రవి మొదటి నుంచి గేమ్‌లో కిరికిరి పెడుతూ సన్నీకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చాడు. టీ షర్ట్ సరిగా వేసుకోవాలన్న పాయింట్‌పై రవి స్టాండ్ అయ్యి ఉంటే సరిపోయేది. కానీ నైపుణ్యం అంటూ కవరింగ్ చేయడంతో రవి కావాలనే సన్నీని ఓడించాడని సన్నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

ఇంత‌కు మాధవీలత ఏమన్నదంటే.. ‘‘రవి నైపుణ్యం చూపిస్తాడా? అయ్యబాబోయ్ సంచాలక్.. అదేమైనా స్వర్గం నుంచి వచ్చిన పుణ్యమా ఏంటి? సన్నీపై కావాలనే ఎటాక్ చేశావ్.. వెరీ బ్యాడ్. 1000 పర్సంట్ రవి రాంగ్’ అంటూ ఫైర్ అయ్యింది. ఇక షణ్ముఖ్ సిరిలను జంట పాములంటూ తీవ్ర పదజాలంతో విరుచుకు పడింది మాధవీలత. ‘షణ్ముఖ్-సిరి ఎప్పుడు చూడు కరిచిపెట్టుకుని ఉంటున్నారు.

ఈ జంటపాముల్లో నుంచి మగపాముని టాస్క్ ఆడటానికి పంపించొచ్చు కదా.. పొద్దున్న లేస్తే మానస్ గాడు ఇట్టా.. మానస్ గాడు అట్టా అని అంటుంది.. ఇప్పుడు మాత్రం మానస్ గాడు కావాల్సి వచ్చాడా? మన ఒళ్లు మాత్రం కరగకూడదుగా.. మన మగపాము వెళ్తే మళ్లీ వాటేసుకోవడానికి కుదరదు జంటపాముల్లా కలిసి ఉండాలి కదా.. కష్టపడి ఆడుతున్న సన్నీపై నోరేసుకుని పడిపోతుంది.. పోయిన వారం పోయినవారం అంటూ అత్త గోకుడు మత్రం మానడం లేదు.. అది అసలు ఆడపిల్లా రాక్షసి పిల్ల.

సిగ్గులేకుండా మానస్ సన్నీకి ఆపోజిట్‌గా ఆడటానికి సిరికి సపోర్ట్ చేశాడు.. స్పోర్టివ్ స్పిరిట్‌నా బొంగేం కాదు.. ఐ హేట్ యు మానస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మాధవీలత.