Madhavi Latha : సుదీర్ఘ‌మైన పోస్ట్‌తో బిగ్ బాస్, నాగార్జున‌ని ఏకిపారేసిన మాధ‌వీల‌త‌

Madhavi Latha : బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న‌ బిగ్ బాస్ అనేది మన సంస్కృతికి వ్యతిరేకం అంటూ కొందరు హడావుడి చేస్తూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్.. కమ్ బీజేపీ నాయకురాలు అయిన మాధవి లత స్పందించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ టీమ్ ను మరియు హోస్ట్ గా చేస్తున్న నాగార్జునను టార్గెట్ చేసి విమర్శలు చేసింది.

Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna
Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna

ఇటీవల ఎపిసోడ్ పై ఆమె ఘాటుగా స్పందించింది. ఒక కంటెస్టెంట్ ను తీవ్రంగా వేదిస్తున్నారు.. మానసికంగా అతడిని బలహీన పర్చే విధంగా మాట్లాడుతున్నారు అంటూ మాధవిలత పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుంది అంటూ ఆమె చాలా సీరియస్ గా కామెంట్స్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna
Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna

బిగ్ బాస్ టీమ్ మరియు నాగార్జున లు ఒక మనిషిని ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తూ అతడిని అత్యంత దారుణంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. దీనిపై మానవ హక్కులు మరియు ప్రజా సంఘాల వారు ఎలాగూ స్పందించరు. నాగరిక సమాజంలో బతుకుతున్న మనం ఇలాంటి చర్యలను అస్సలు సహించవద్దు అన్నట్లుగా ఆమె పోస్ట్ లో పేర్కొంది.

Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna
Madhavi Latha about BiggBoss 5 and Nagarjuna

మాధవిలత అంతగా చెబుతున్న ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరై ఉంటారు అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. నాగార్జున మరియు బిబి టీమ్ ప్రతి ఒక్కరి విషయంలో సమాన దృష్టితోనే ఉంటారు. వారు ఎందుకు ఒకరిని ఆత్మహత్య చేసుకునేంతగా అనాగరికంగా వేదిస్తారు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తప్పుని నిలదీయలేని ఒక హోస్ట్ తెలుగులో , విషపు ఆలోచనలకి బాటలు వేయడం …చూస్తున్న పిల్లలు సహజం గా సైకో మెంటాలిటీ ఉన్నవాళ్లు సమాజం లో 70% ఉన్నారు .వాళ్ళు ఇదే సరి అయినది అన్నట్లు ఉంటున్నారు . ఎలాంటి అనాగరికపు చర్యలకి దిగజారుతున్న టీవీ షో కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్న ప్రజలు, దాని సంబంధిత మినిస్ట్రీ, సెన్సార్, వీటి గురించి ఆలోచించ‌డం లేదు. దేవుడి దయవలన డబ్బు వస్తే ఆ ఛానల్ ని కొని ఆ షో కి నేనే హోస్ట్‌గా వెళ్లి రోస్ట్ చేస్తాను అని పేర్కొంది. మాధ‌వీ పోస్ట్ సంచ‌న‌లంగా మారింది.