Biggboss 5: ర‌విపై పెరుగుతున్న అనుమానాలు.. బిగ్ బాస్ ఆట‌ల గురించి ర‌వికి ముందే తెలుసా?

Biggboss 5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో కెప్టెన్సీ టాస్క్ హోరా హోరీగా సాగుతుంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్ నాలుగు టీంల మధ్య అన్నట్టుగా కాకుండా సంచాలకులు (సిరి, కాజల్) వర్సెస్ ఇంటి సభ్యులు అన్నట్టుగా మారింది. గ్రీన్ టీం (రవి, లోబో, శ్వేతా)లకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించింది. దీనిలో భాగంగా ఆపోజిట్ టీంలో ఉన్న బొమ్మల్ని తీసుకోవచ్చని బిగ్ బాస్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.

Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5
Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5

యాంకర్ రవి.. స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్‌ టీమ్‌ దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో యానీ మాస్టర్‌ మరో ప్లాన్‌ చేసింది. శ్వేత ద‌గ్గ‌ర ఉన్న బొమ్మ‌ల‌ను తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా ఈ క్ర‌మంలో శ్శేత‌- అనీ మాస్ట‌ర్ మ‌ధ్య పెద్ద గొడ‌వ అయింది.

Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5
Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5

లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ అనీ మాస్ట‌ర్ గ‌ట్టిగ‌ట్టిగా అరిచింది. త‌ర్వాత మ‌ళ్లీ..అనీ వెళ్లి శ్వేతని బుజ్జ‌గించింది. సన్నీ, మానస్‌ అయితే రవి గేమ్‌ ప్లాన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు.. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు.

Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5
Maanas Doubts on Ravi Teams Secret Power in Biggboss 5

ఇక మానస్‌ మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు.. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు.. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది.. దాన్ని గుంజుకుని.. ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే ఆట ఆడారు’అన్నారు.

ప్రియాంక‌.. మాన‌స్ మ‌ధ్య కొంచెంసేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. ప్రియ.. ‘నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బార్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు.. ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావ్ ఎందుకు? నేను బార్డర్ ఎందుకు పెడతా అంటే.. ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని.. ప్రతి ఒక్క రిలేషన్‌లోనూ ఎక్స్ పర్టేషన్స్ ఉంటాయి.. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా అని అన్నాడు మాన‌స్.

ఈ ప్ర‌శ్న ప‌దేప‌దే ప్రియాంక అడ‌గ‌డంతో మాన‌స్ ఫైర్ అయ్యాడు.ప్రియాంక‌పై అరిచాడు. దీంతో ఆమె ఎమోష‌న‌ల్ అయింది. ఇక కెప్టెన్సీని ఎలా అయిన ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ వేసిన కాజ‌ల్ రవికి చెక్‌ పెట్టే ప్లాన్‌ వేసింది. గతంలో చెక్‌ చేసి ఓకే చెప్పిన బొమ్మలను కూడా మళ్లీ పరిశీలించాలని పట్టుపట్టింది. సంచాలకులదే తుది నిర్ణయం కావడంతో.. కాజల్‌ చెప్పినట్టుగానే అన్ని బొమ్మలను మళ్లీ తీసుకొచ్చింది రవీ టీమ్‌. కాజ‌ల్ క‌న్నింగ్ ప్లాన్‌ని ర‌వి టీమ్ ఎలా ఎదురిస్తారో నేడు తెలియ‌నుంది.