Maadhavi Latha: స‌మంత డ‌బ్బు సంపాదించే యంత్రంగా మారింది.. మాధ‌వీ ల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Maadhavi Latha: 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌- స‌మంత అక్టోబ‌ర్ 2న విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడిపోయిన ద‌గ్గ‌ర నుండివారికి సంబంధించిన ఎన్ని వార్త‌లు వ‌స్తున్నాయో లెక్కే లేదు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం విడాకుల విష‌యంపై స్పందిస్తున్నారు.

చిన్నా చితకా సినిమాలు చేస్తున్న పెద్ద అవకాశాలు ద‌క్కించుకోలేక‌పోయిన మాధ‌వీ ల‌త రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనూహ్య పరిస్థితుల్లో ఆమెను దారుణంగా ఓడిపోయారు. ఈ అమ్మ‌డు తాజాగా స‌మంత‌పై వ‌స్తున్న ప్ర‌చారాల‌పై స్పందించింది. వ్య‌క్తితో ఎఫైర్ వ‌ల‌న స‌మంత చైతూని వదిలేసింద‌నే ప్రచారం జ‌ర‌గ‌గా, దీనిపై మాధ‌వీ ల‌త మాట్లాడింది.

సమంత చాలా మంచి అమ్మాయి అని కానీ వందలో 99 శాతం మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమె తప్పుగా చిత్రీకరిస్తూ బాడ్ కామెంట్స్ చేస్తున్నారని అలా చేయవద్దు అని కోరింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టల గురించి విడాకుల దాకా వెళ్ళింది అని కొందరు అంటున్నారు అని అలా అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు.

సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీ లతా చెప్పుకొచ్చారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం వాడుకున్నాడని ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చింది .

తనకు 30 ఏళ్ల వయసు రాగానే ఒక బిడ్డకు తల్లి కావాలనే విషయాన్ని గతంలో ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఒక షోలో వెల్లడించిందని మాధ‌వీ ల‌త‌ పేర్కొంది. దానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయితే ఆమెకు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అని భావించి ఆమె మనస్సు మార్చి తల్లి కావాలనే ఆమె ఆశలు చంపేశారని మాధవీ లతా ఆరోపించింది.

కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే సమంతకు వేల రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు తెలుసా అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఆమె ఏదైనా షాప్ ఓపెనింగ్ లోకి వెళితే ఆ ఓపెనింగులకు వచ్చే డబ్బు నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయమని చెప్పేది .ఇవన్నీ నేనేదో ఊహించి చెప్పడం లేదని పేర్కొన్న మాధవి లత సమంతకు సన్నిహితులే నాకు ఈ విషయాలు చెప్పారు అని చెప్పుకొచ్చింది .

ఆమె కేవలం డబ్బు సంపాదించే ఒక యంత్రంగా మాత్రమే పనికి వచ్చిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరమైతే బాధగానే ఉంటుంది కానీ ఎంత బాధ అనుభవించి ఉంటే పెళ్లి చేసుకున్న వాడికి దూరం అవ్వాలని అనుకుంటుందో ఆలోచించాలని చెప్పుకొచ్చింది. మాధ‌వీ ల‌త .

ఎవరు ఆమెకు పాకెట్ మనీ ఇస్తున్నారు అనే విషయాలను ప్రస్తావించకపోయినా అక్కినేని ఫ్యామిలీ అనేట్టు గానే మాధవి లత కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మాధవి లత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.