MAA: మా అధ్యక్షుడిగా బాల‌కృష్ణ‌.. నాకు అభ్యంత‌రం లేద‌న్న విష్ణు

MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌లు మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నుండగా, అధ్య‌క్ష ప‌దవి కోసం ప్ర‌కాశ్‌రాజ్, మంచు విష్ణు, హేమ‌, జీవిత‌, సీవీఎల్ న‌ర‌సింహారావు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య గట్టి పోటీ ఉంటుంద‌ని అంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఎల‌క్ష‌న్ ప్ర‌చారంలో భాగంగా వీరు చేసే కొన్ని వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల బాగోగుల కోసం మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఏర్పాటు కాగా, ప్ర‌తి రెండేళ్లకొకసారి ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. క‌రోనా వ‌ల‌న ఈ సారి కొద్దిగా లేట్ అయింది. సెప్టెంబ‌ర్ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ‘మా’ అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన విష్ణు.. తాను మా బిల్డింగ్‌ని సొంత ఖ‌ర్చుతో నిర్మిస్తాన‌ని అన్నాడు. అలానే మా అధ్య‌క్షుడి ప‌దవిని ఏక‌గ్రీంగా ఇస్తే తాను త‌ప్పుకుంటానని ప్ర‌క‌టించాడు. మంచు విష్ణు వ్యాఖ్య‌ల త‌ర్వాత బాల‌య్య మా ఎన్నిక‌ల‌కు స్పందించి కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఇన్నాళ్లు పెద్ద‌లంతా క‌లిసి మా బిల్డింగ్ ఎందుకు క‌ట్ట‌లేక‌పోయార‌ని ప్ర‌శ్నించాడు. అంతేకాదు, భవన నిర్మాణంలో మంచు విష్ణుకి త‌న సహాయం చేస్తానని కూడా పేర్కొన్నారు.

తాజాగా మంచు విష్ణు ఎన్నిక‌ల గురించి మాట్లాడుతూ… సినీ పెద్దలంతా కలిసి ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు అభ్యంతరం అస్సలు లేదు. నందమూరి బాలకృష్ణ గారు మా ప్రెసిడెంట్ అవ్వాలని నాకు కోరికగా ఉంది. ఆయన అయితే మామూలుగా ఉండదు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుండు’ అంటూ వెల్లడించాడు విష్ణు. బాల‌కృష్ణ గారు ప్రెసిడెంట్ కావాల‌నేది చాలా మంది అభిప్రాయం. ఆయన జనరేషన్‌లో కొంత మంది ప్రెసిడెంట్ అవలేదు. వాళ్లలో ఎవరైనా చూడాలని ఉంది.

మా కార్య‌క‌లాపాల కోసం వారు స‌మ‌యం కేటాయిస్తారా అనేది కొంత డౌట్. అందుకే వారు ప్రెసిడెంట్ ప‌దవి గురించి ఆగుతున్నారేమో అంటూ విష్ణు కామెంట్స్ చేశాడు. బాలయ్య‌ను అధ్య‌క్షుడిగా చూడాల‌ని ఉందని విష్ణు చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.