Love Story: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కురిపిస్తున్న‌ల‌వ్ స్టోరీ..ఇండ‌స్ట్రీ ఖుష్‌

Love Story: కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్స్‌కి ఆహ్వానిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ. కరోనా నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనుకుంటున్న తరుణంలో లవ్‌స్టోరీ మూవీ అందరి అనుమానాలను పటాపంచలు చేసేసింది. సాయి పల్లవి, నాగచైతన్య కలిసి నటించిన లవ్‌స్టోరి రికార్డ్ కలెక్షన్స్‌లతో దూసుకెళ్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజైంది.

Lovestory Movie 2 days AP/TS share
Lovestory Movie 2 days AP/TS share

లవ్ స్టోరి మూవీకి ఓవర్సీస్‌లో ప్రధానంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన వ్యక్తం అవుతున్నది. తొలి రోజే అంటే గురువారం ప్రీమియర్ల రూపంలో రికార్డు వసూళ్లను రాబట్టిన ఈచిత్రం రెండో రోజు (శుక్రవారం) కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే ఈ వారాంతంలో మరో మైలురాయిని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజే 306k డాలర్లు లవ్ స్టోరి మూవీకి రిలీజ్‌కు ముందే భారీ హైప్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరిగింది. దాంతో తొలి రోజు ప్రీమియర్ల ద్వారా రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి.

సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన వకీల్ సాబ్ కంటే ఎక్కువగా ల‌వ్‌స్టోరీ చిత్రం వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది. మొదటి రోజు ప్రీమియర్ల తర్వాత ఏ మాత్రం జోష్ తగ్గకుండా రెండు రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రెండో రోజున సమారు 290K వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణ స్పష్టంగా కనిపించింది. రెండు రోజుల్లోనే 500K డాలర్లు వరుసగా రెండు రోజులు బాక్సాఫీస్‌ను కుమ్మేయడంతో సునాయాసంగా 500K అమెరికన్ డాలర్లను వసూలు చేసింది.

రెండో రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగితే లవ్ స్టోరి కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇదే రేంజ్ క్రేజ్ కొనసాగితే.. వారాంతం అంటే.. ఆదివారం నాటికి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉంటే తొలి వారంలోనే లవ్ స్టోరి బయ్యర్లకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు ఇంతగా సానుకూల వాతావరణం కలిగించిన సినిమా లవ్ స్టోరి కావడం విశేషంగా మారింది.

ఇండియాలోనే తొలి రోజు లవ్ స్టోరి చిత్రం 10.80 కోట్లు రాబట్టగా, సీటిమార్ 5 కోట్లు, షాంగ్చీ 4.15 కోట్లు, బెల్ బాటమ్ చిత్రం రూ.3.55 కోట్లు వసూలు చేసింది. కరోనావైరస్ కారణంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాదిలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతున్న విషయం తెలిసిందే.