Love Story: మూడో రోజు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ల‌వ్ స్టోరీ.. లాభాలు రాబ‌ట్టిందా..!

Love Story: శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం ల‌వ్ స్టోరీ. ఈ చిత్ర సెప్టెంబ‌ర్ 24న థియేట‌ర్స్‌లోకి రాగా,విడుద‌లైన ప్ర‌తి చోట మంచి టాక్‌తో దూసుకుపోతుంది. కుల, మతాల వివక్ష కథాంశంగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరిని తెరకెక్కించారు. సాయిపల్లవి అగ్రకుటుంబానికి చెందిన యువతిగా, నాగచైతన్య దళిత కుటుంబానికి చెందిన యువకుడిగా నటించారు.

Love Story Movie Third Day Collections
Love Story Movie Third Day Collections

చిత్రంలో సున్నితమైన, సంక్లిష్టమైన అంశాలను శేఖర్ కమ్ముల బాగా డీల్ చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి మూవీకి సంబంధించిన మూడో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో మూడో రోజున రూ.2.54 కోట్లు, సీడెడ్‌లో 83 లక్షలు, ఉత్తరాంధ్రలో 57 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.20 లక్షలు, గుంటూరులో 31 లక్షలు రూపాయలు, కృష్ణా జిల్లాలో రూ.30.2 లక్షలు, నెల్లూరులో రూ.15 లక్షలు వసూలు చేసింది.

మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.5.19 లక్షల నికర వసూళ్లు, రూ.9.10 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లవ్ స్టోరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా గత మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.8.16 కోట్లు, సీడెడ్‌లో రూ.2.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.98 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.05 కోట్లు, పశ్చిమ గోదావరి జి్లాలో రూ.94 కోట్లు, గుంటూరులో రూ.1.14 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.87 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షల రూపాయలను వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.17.40 కోట్లు నికర వసూళ్లు, రూ.28.23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

తొలి రోజున ఈ చిత్రం రూ. 7.13 కోట్లు నికర వసూళ్లు, రెండో రోజున రూ.5.08 కోట్లు, మూడో రోజున రూ.5.19 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లోనే రూ.17.40 కోట్ల నికర, రూ.28.23 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అన్ని రాష్ట్రాల‌ని క‌లిపి ఈ చిత్రం 92 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో సుమారు రూ.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.22.07 కోట్లు నికర, రూ.37.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

లవ్ స్టోరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.31.2 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.32 కోట్లకుపైగానే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.22.07 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.9.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.