Love Story: బిగ్ బాస్ వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న నాగ చైత‌న్య‌, సాయిప‌ల్లవి..!

Love Story: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మానికి భారీ ఆద‌ర‌ణ ఉంటుంది. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కూడా కొందరు స్టార్స్ హౌజ్‌లోకి వెళ్లి సంద‌డి చేసే వారు. ఇప్పుడు క‌రోనా వ‌ల‌న కాస్త త‌గ్గింది. హౌజ్‌లోకి వెళ్ల‌కుండా కేవ‌లం స్టేజ్ మీద నుండే త‌మ సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు.

Love Story Movie team in Bigg Boss House
Love Story Movie team in Bigg Boss House

ఇప్పుడు సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కానున్న ల‌వ్ స్టోరీ ప్ర‌మోష‌న్ కోసం నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి బిగ్ బాస్ స్టేజ్‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. శని, ఆది వారాల‌లో నాగార్జున వ‌స్తాడు కాబ‌ట్టి ఆ రోజుల‌లో చైతూ, సాయి ప‌ల్లవి స్టేజ్‌పై నుండి సంద‌డి చేయ‌డంతో పాటు త‌మ సినిమాని ప్ర‌మోట్ చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. సినిమాపై భారీ అంచ‌నాలు కూడా పెంచాయి. కరోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రాన్ని వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేసి జ‌నాల‌లోకి తీసుకెళ్లాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ల‌వ్ స్టోరీ అనే సింపుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. వినాయక చవితి సందర్భంగా విడుదుల చేద్దాం అనుకుంటే నాని నటించిన టక్ జగదీష్ సినిమా అదే రోజు ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. దాంతో లవ్ స్టోరీ వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నిడివి కూడా సుమారుగా 2గంటల 46నిమిషాలు వాచినట్టు తెలుస్తుంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.