Love Story: మహేష్ బాబు థియేటర్ లో ల‌వ్ స్టోరీ ప్ర‌భంజ‌నం.. ఆశ్చ‌ర్య‌పోతున్న‌ట్రేడ్ వ‌ర్గాలు

Love Story: శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం ల‌వ్ స్టోరీ. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబ‌ట్టింది. దసరా సీజన్‌లో కొన్ని కొత్త సినిమాలు ఉన్నప్పటికీ ఇది మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

TheNewsQube-
Love Story Movie Collects 1 Crore in AMB Cinemas

Love Story Movie Collects 1 Crore in AMB Cinemas

తాజాగా ఈ చిత్రం వసూళ్ల పై ఏ ఎం బీ సినిమాస్ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసింది. లవ్ స్టోరీ సక్సెస్ స్టోరీ అని చెప్తూనే దాదాపు 251 షో లకి గానూ ఏఎంబీ సినిమాస్ లో మొత్తం 48,233 మంది లవ్ స్టోరీ సినిమాను చూసినట్లు తెలిపింది. ఈ మేరకు కోటి రూపాయలు కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో దీన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు ల‌వ్ స్టోరీ చిత్రాన్ని తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా అదిరిపోయేలా వచ్చాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అంతేకాదు, దీని వల్ల నిర్మాతలకు లాభాలు కూడా దక్కాయి. ఇక, ఇప్పటికీ ఈ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లలో మంచి స్పందనే దక్కుతుండడం విశేషం.

సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ‘లవ్ స్టోరి’ మూవీ గురించి తాజాగా టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎమ్‌బీ సినిమాస్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్ప‌డంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో సత్తా చాటిన నాగ చైతన్య.. సాయి పల్లవి ‘లవ్ స్టోరి’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా సమయం దగ్గర పడింది. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను అక్టోబర్ 22 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.