Love Story: వ‌కీల్ సాబ్‌ని బీట్ చేసిన ల‌వ్ స్టోరీ.. క‌లెక్ష‌న్ల వర్షం కురిపిస్తున్న క్లాస్ చిత్రం

Love Story: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇద్దరూ క‌లిసి న‌టించిన చిత్రం ల‌వ్ స్టోరీ. ఇద్ద‌రు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విజువల్స్, పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. శేఖర్ కమ్ముల కథ, కథనం, దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ‘లవ్ స్టోరీ’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని చూసేందుకు థియేట‌ర్స్‌కి క్యూ క‌డుతున్నారు.

Love Story

మూడు రోజుల వ‌ర‌కు ల‌వ్ స్టోరీ అడ్వాన్స్ బుకింగ్ పూర్తి కాగా, రానున్న రోజుల‌లో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తుంద‌ని అంటున్నారు.పాండమిక్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆదరిస్తారనే మాటను మరోసారి నిజం చేసి చూపించారు.

మల్టీప్లెక్సులు, సింగిల్ థియేటర్లు అన్న తేడా లేకుండా భారీగా థియేటర్లకు తరలి వస్తున్నారు. మొత్తానికి ‘లవ్ స్టోరీ’ ని మ్యాజికల్ బ్లాక్‌బస్టర్ చేసేశారు అక్కినేని ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్. ఈ చిత్రం ప్రీమియ‌ర్స్‌కి 305 కె డాల‌ర్స్ గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. పాండ‌మిక్ స‌మ‌యంలో ఈ నెంబ‌ర్ అందుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుద‌లైన వకీల్ సాబ్ చిత్రం 300 కె డాల‌ర్స్ రాబ‌ట్ట‌గా, దీనిని ల‌వ్ స్టోరీ బీట్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేదు అంటున్నారు. ల‌వ్ స్టోరీ చిత్రం రానున్న రోజుల‌లో మంచి కలెక్ష‌న్స్ రాబ‌ట్టి చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని అంటున్నారు. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రాన్నితెర‌కెక్కించ‌గా,ఈ చిత్రం ఆడియ‌న్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.