Love story : లవ్ స్టోరి వాళ్ళకోసమే పోస్ట్ పోన్ చేశారు..!

Love story : లవ్ స్టోరి సినిమా రిలీజ్ ఆగిపోయింది. రెండు రోజుల నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి మేకర్స్ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. దాంతో ఇది రూమర్.. గాసిప్ అని అభిమానులు చెప్పుకున్నారు. అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఈ తాజా చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరి సినిమాని అందమైన ప్రేమకథగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. ఈ విషయం లవ్ స్టోరి సినిమా సాంగ్స్, పోస్టర్, టీజర్..ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

love-story-is-postponed-for-their-sake
love-story-is-postponed-for-their-sake

అందుకే ఈ సినిమా మీద అక్కినేని అభిమానుల్లో..సాయి పల్లవి అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు..మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తరువాత రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని దర్శక, నిర్మాతలు మీడియా ద్వారా అధికారకంగా తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Love story : ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..?

ఈ సందర్భంగా నాగ చైతన్య – శేఖర్ కమ్ముల – నిర్మాతలు నారాయణ దాస్ నారాంగ్ – సునీల్ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు సినిమాకి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెప్పారు. ఇక ఈ సినిమా సాంగ్స్ తో ఎంతటి అంచనాలను పెంచిందో అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..రిలీజయ్యాక ఎలాంటి సక్సస్ దక్కుతుందో.

Advertisement