List Of Hero Heroines Dating In Tollywood : టాలీవుడ్ లో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న జంటలు ఇవే.. పెళ్లి పీటలు ఎక్కుతారా..?
NQ Staff - September 21, 2023 / 10:08 AM IST

List Of Hero Heroines Dating In Tollywood :
డేటింగ్ కల్చర్ అనేది ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే మనకు వినిపించేది. కానీ ఇప్పుడు మన ఇండియాకు కూడా బాగా పాకింది. మొన్నటి వరకు బాలీవుడ్ లోనే ఇది ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా బాగా పెరిగిపోయింది ఈ కల్చర్. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కొన్ని జంటలు డేటింగ్ లో మునిగితేలుతున్నాయి. అలాంటి వారిలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ-రష్మిక గురించి. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్నారు. అయితే విజయ్ తో రష్మిక ఇప్పటికే పలుమార్లు సీక్రెట్ గా విదేశాలకు టూర్ కు వెళ్లింది.
మొన్న ఆ మధ్య మాల్దీవులకు ఇద్దరూ కలిసి వెళ్లారు. అయితే ఎవరికీ తెలియదనుకున్నారు. కానీ ఒకే చోట ఒకే సమయంలో వేర్వేరుగా దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయారు. అంతే కాకుండా రష్మిక లైవ్ చాట్ లోకి అనుకోకుండా విజయ్ వాయిస్ వినిపించడం, మొన్న హైదరాబాద్ కు వచ్చిన రష్మిక విజయ్ ఇంటి గార్డెన్ లో ఫొటో దిగి షేర్ చేసి మరోసారి అడ్డంగా దొరికిపోయింది. దాంతో వీరిద్దరి డేటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
తెలుగు హీరోయిన అదితి రావు హైదరీ తమిళ హీరో సిద్దార్థ్ కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీరిద్దరూ కలిసి మహా సముద్రం సినిమలో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరికి గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు అయి విడాకులు కూడా అయ్యాయి. అంతకు ముందే సిద్దార్థ్ చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఆ అనుభవంతోనే అదితిని కూడా పడేశాడని టాక్ వినిపిస్తోంది. అయితే మొదట వీరిద్దరి డేటింగ్ వార్తలను ఇద్దరూ ఖండించారు. కానీ రెస్టారెంట్లు, పబ్బులకు చేతుల్లో చెయ్యేసుకుని వెళ్లిన ఫొటోలు లీక్ కావడంతో ఒప్పుకోక తప్పలేదు.

List Of Hero Heroines Dating In Tollywood
వీరిద్దరూ ఇప్పుడు డీప్ డేటింగ్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో జంట తమన్నా-విజయ్ వర్మ. తమన్నాకు ఎంత ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిల్కీ బ్యూటీ సినిమాల్లో ఒక్కరితో కూడా లిప్ లాక్ చేయలేదు. కానీ ప్రియుడు విజయ్ వర్మతో మాత్రం లిప్ లాక్ చేసింది. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించినప్పటి నుంచే ప్రేమ చిగురించింది. న్యూ ఇయర్ వేడుకల్లో ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్న వీడియో కూడా లీక్ అయింది.
అంతే కాకుండా విజయ్ వర్మతో డేటింగ్ ను స్వయంగా తమన్నా కన్ఫర్మ్ చేసింది. అటు విజయ్ వర్మ కూడా ఒప్పుకున్నారు. విజయ్ వర్మ గతంలో నాని హీరోగా వచ్చిన ఎమ్ సీఏ సినిమాలో విలన్ గా చేశాడు. తమన్నా స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు సినిమాలు చేస్తోంది. చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.