Jai Bhim : ఎలుక కూర తినాల్సి వ‌చ్చింద‌న్న జై భీమ్ న‌టి.. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పిందిగా..!

Jai Bhim : జైభీమ్ చిత్రంలో సినతల్లి పాత్రలో నటించి మెప్పించిన‌ మలయాళీ నటి లిజోమోల్ జోస్. గర్భం నిండి అష్టకష్టాలు అనుభవించే గిరిజన యువతిగా లిజో నటన కంట తడి పెట్టిస్తుంది. ఎరుకల(గిరిజన) కమ్యూనిటీకి చెందిన మహిళగా డీగ్లామరస్ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకు జనం నీరాజనాలు పలికారు. ఆమె పాత్ర‌కు అవార్డులు ద‌క్క‌డం ఖాయం అంటున్నారు.

Lijomol Jose for jai bhim
Lijomol Jose for jai bhim

సామాజిక అసమానతలను ప్రశ్నించేలా రూపొందిన చిత్రం జై భీమ్. ఈ సినిమా ఇటీవ‌లే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌లైంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్ర‌మిది. అంతే కాదండోయ్‌..రాజ‌కీయ ప‌ర‌మైన విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. హీరో సూర్య త‌మ సంఘాన్ని అవ‌మానించారంటూ వ‌న్నియార్‌లు ఆయ‌న‌పై కేసు పెట్టి ఐదు కోట్ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేశారు.

Lijomol Jose for jai bhim
Lijomol Jose for jai bhim

సూర్య దాడి చేస్తే ల‌క్ష రూపాయ‌లు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే తన‌కు సినిమాల ద్వారా ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని సూర్య తెలిపారు. ఈ సినిమా విడుద‌ల ముందు గిరిజ‌న విద్య కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క‌లిసి కోటి రూపాయ‌ల‌ను విరాళంగా అందిచిన సూర్య‌, విడుద‌ల త‌ర్వాత జై భీమ్ సినిమాకు స్ఫూర్తినిచ్చిన నిజ‌మైన సిన‌తల్లికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.

అయితే జై భీమ్ సినిమా కోసం సినతల్లి జీవనం.. వారి పద్దతులు తెలుసుకోవడానికి ప్రతిరోజూ గుడిసెలకు వెళ్ళేదాన్ని అని చెప్పుకొచ్చింది లిజో.అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకుని వాళ్లతో కలిసి పని చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని.. పగలు రాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని.. అవన్ని పనులు తాను కూడా చేసినట్లు తెలిపింది. సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని.. అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది.

అంతేకాకుండా.. ఆ గిరిజనులు ఎలుకలను వండుకుని తింటారని.. కానీ కేవలం పొలాల్లో ఉండే ఎలుకలను తింటారని.. నేను కూడా వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నానని.. అందుకే ఎలుక కూర తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది లిజోమోల్. ఎలుకల కూర అచ్చం చికెన్ లా అనిపించిందని.. ఇంట్లో వాళ్లకు తెలిసి తనను అడిగారని.. కానీ తను వాళ్లకు సర్ది చెప్పానని తెలిపింది. అప్పటి నుంచి ఆ విషయం ఇంట్లో వాళ్లు అడగలేదని చెప్పుకొచ్చింది లిజోమోల్.