Liger: మైక్ టైస‌న్‌కి భారతీయ వంట‌కాలు రుచి చూపించిన లైగ‌ర్ టీం

Liger: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ,అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న‌ పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌బ్రీడ్‌’ అనేది ఉపశీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు రూపొందిస్తున్నాయి. పూరి జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు విదేశీ ఫైటర్లు కనిపించనున్నారు.

TheNewsQube-
liger team party to mike tyson
liger team party to mike tyson

ఇందులోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ని సంప్రదించి ఒప్పించింది . మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశన్నంటాయి.తాజాగా అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు. మైక్ టైసన్‌ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఆశ్చర్యపోయింది.

అంతే కాదు మైక్ టైసన్ మన భారతీయ వంటకాలను రుచిచూపించారట. ఆయనకు అవి చాలా బాగా నచ్చాయట. ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారట మైక్. అంతే కాదు ఆయన భార్య కోసం స్పెషల్‌గా భోజన ఏర్పాటు చేసింది లైగర్ టీం.

liger team party to mike tyson1
liger team party to mike tyson1

గార్లిక్ నాన్, బట‌ర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగార‌ట‌. ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్యపోయింది. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ ముచ్చటపడ్డారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా విడుద‌ల కానుంది.