Liger: బాక్సింగ్ టైగ‌ర్‌తో మ‌స్తీ చేస్తున్న లైగ‌ర్ టీం

Liger:పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అమెరికా షెడ్యూల్ మొదలైంది. ఈ షూట్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే మైక్ టైస‌న్‌తో చిత్ర బృందం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

Image

అమెరికా షెడ్యూల్‌లో విజయ్‌ దేవరకొండ, మైక్‌టైసన్‌పై ముఖ్య పోరాటఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. అమెరికా షెడ్యూల్‌లో మైక్‌టైసన్‌ జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో తీయించుకున్న ఓ ఫొటోను విజయ్‌ దేవరకొండ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘టైసన్‌తో గడుపుతున్న ప్రతి నిమిషాన్ని గొప్ప జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటున్నా. ఆయన ప్రేమకు నిర్వచనం. ఈ ఫొటో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. లైగర్‌ వర్సెస్‌ లెజెండ్‌..’ అంటూ ఫొటోపై వ్యాఖ్యానించారు.

ఇక తాజాగా మైక్ టైసన్‌తో పాటు పూరీ, ఛార్మి, అన‌న్య పాండే స‌ర‌దాగా మైక్ టైస‌న్‌తో క‌లిసి ఫొటోలు దిగారు. ఇవి వైర‌ల్‌గా మారాయి. టీం అంతా ఫుల్ జోష్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై కరణ్‌జోహార్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మి, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Image
మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు విదేశీ ఫైటర్లు కనిపించనున్నారు. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

బాలయ్య.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘లైగర్’లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.రీసెంట్‌గా గోవాలో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో ఈ సినిమా యూనిట్‌ను బాలయ్య సడెన్ విజిట్ ఇచ్చి ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే కదా.

Image