Liger : లైగర్ విషయంలో పూరి జగన్నాధ్ నుంచి అప్‌డేట్ కావాలి ..!

Liger : లైగర్ సినిమా తప్ప దాదాపు అన్నీ సినిమాల అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. పూరి కెరీర్ లో ఇంత లేట్ అయిన సినిమా అంటే బహుషా ఒక్క లైగర్ మాత్రమే అని చెప్పుకుంటున్నారు. పూరి జగన్నాధ్ కి ఉన్న దూకుడు కి ఈ పాటికే లైగర్ రిలీజ్ కావాల్సింది. ఎంత కాదన్న లాక్ డౌన్ కి ముందే 40 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసిన పూరి ఆ తర్వాత షూటింగ్ షట్ డౌన్ చేసి వచ్చేశాడు. లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాల షూటింగ్ మొదలై శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 90 శాతం సినిమాలు రీసెంట్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేశాయి.

liger- Puri Jagannadh needs an update on Liger ..!
liger- Puri Jagannadh needs an update on Liger ..!

కాని పూరి మాత్రం ఇంకా లైగర్ షూటింగ్ మొదలే పెట్టలేదు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టినా ఈ పాటికి థియేటర్స్ లో బొమ్మ పడేది. అయితే ఈ విషయంలో పూరి ఫ్యాన్స్ తో పాటు విజయ్ దేరకొండ ఫ్యాన్స్ కూడా లైగర్ రిలీజ్ ఎప్పుడో చెప్పమని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా లైగర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు.

Liger : ఎన్ని సినిమాలు బరిలో దిగినా పూరి సినిమాకి ఉండే క్రేజే వేరు..!

ఇటీవల లైగర్ సినిమా నుంచి టైటిల్ తో పాటు విజయ్ దేవరకొండ లుక్ ని రిలీజ్ చేశారు. సలా క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ లైన్ తో రిలీజైన ఈ లుక్ సినిమా మీద ఊహించని విధంగా అంచనాలను పెంచేసింది. ఇక గత రెండు మూడు రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మీడియం బడ్జెట్ సినిమాల వరకు తమ సినిమాల రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా పూరి మాత్రం డైలమాలో ఉన్నాడని అంటున్నారు. అయితే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని భాషల్లో కరెక్ట్ గా సూటయ్యే రిలీజ్ డేట్ కోసం పూరి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎన్ని సినిమాలు బరిలో దిగినా పూరి సినిమాకి ఉండే క్రేజే వేరు. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

Advertisement