Leander Paes: టెన్నిస్ లెజెండ్‌తో మ‌గ‌ధీర గార్ల్ డేటింగ్..!

Leander Paes: క్రీడాకారుల‌కి, సినిమా స్టార్స్ కి మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీళ్లు పాలు నీళ్ల‌లా క‌లిపోతుంటారు. ఈ క్ర‌మంలో పెళ్లి పీట‌లెక్క‌డం కూడా చేస్తుంటారు. ఇప్ప‌టికే ప‌లువురు క్రికెట‌ర్స్ సినిమా స్టార్స్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్.. ముద్దుగుమ్మ కిమ్​ శర్మతో రిలేషన్​లో ఉన్నాడ‌నే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Kim sharma Dating With Leander Paes
Kim sharma Dating With Leander Paes

 

ముంబయిలోని పైలేట్స్ స్టూడియో దగ్గర ఏడాది క్రితం మే నెలలో పేస్, కిమ్ శర్మ కనిపించారు. అయితే వర్కౌట్లు చేసుకునేందుకు వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. కాని ప్ర‌స్తుతం వీరిద్దరూ గోవాలో విహరిస్తుండటంతో రిలేష‌న్ షిప్‌లో ఉన్నార‌నే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కాగా, వారిద్దరూ కలసి ఉంటున్న పిక్స్ ని ఓ రెస్టారెంట్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లియాండర్ పేస్.. కిమ్ శర్మని వెనుక నుంచి హగ్ చేసుకుని ఉన్న పిక్..ఆమెతో డిన్నర్ చేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అతి త్వ‌ర‌లోనే వీరిరివురు త‌మ రిలేష‌న్ షిప్‌పై అఫీషిల్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అభిమానులు అనుకుంటున్నారు. ఇక టెన్నిస్ ప్లేయర్ పేస్.. మోడల్ రియా పిల్లాయితో పదేళ్లపాటు రిలేషన్​లో ఉన్నాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది. తనను పేస్ మోసం చేశాడని, రియా అతడిపై ఆరోపణలు కూడా చేసింది. రియా నుండి విడిపోయిన త‌ర్వాత పేస్ కిమ్ శ‌ర్మ‌తో రిలేష‌న్‌షిప్ మెయింటైన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక కిమ్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు నటుడు హర్షవర్ధన్​ రాణాతో రిలేషన్​లో ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’ సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ‘మగధీర’, ‘ఆంజనేయులు’ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది.