Laya: ప‌ర్‌ఫెక్ట్ పిక్చ‌ర్‌.. ఫ్యామిలీతో ట్రిప్ వేసిన ల‌య‌.. అంద‌మైన కుటుంబం అంటూ కామెంట్స్

Laya: చూడ‌గానే మ‌న ప‌క్కింటి అమ్మాయిలా కనిపించే అందాల ముద్దుగుమ్మ ల‌య. బాల్యంలోనే ‘భద్రం కొడుకో’ చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో ల‌చ్‌లో ఉంటుంది.

laya picnic trip with family
laya picnic trip with family

1999లో తెరకెక్కిన ‘స్వయంవరం’ చిత్రంతో లయ నాయికగా పరిచయం అయ్యారు. వేణు హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది. “మా బాలాజీ, మనోహరం, దేవుల్ళు, రామ్మా చిలకమ్మా, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, విజయేంద్రవర్మ” వంటి చిత్రాలలో లయ నటించి ఆకట్టుకున్నారు.

laya picnic trip with family
laya picnic trip with family

కొన్ని కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలలోనూ లయ అభినయించారు. 2000లో ‘మనోహరం’ చిత్రం ద్వారా, 2001లో ‘ప్రేమించు’తోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ. లయ ఓ వైపు నటిస్తూనే, మరోవైపు తన చదువు సాగించారు. కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చేశారు. 2006లో శ్రీగణేశ్ గొర్తిని పెళ్ళాడారు లయ. వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు.

laya picnic trip with family
laya picnic trip with family

అమెరికాలో తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూసాగారు లయ. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తే మాత్రం వదలకుండా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నటించారు. 2018లో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో లయ నటించారు. మళ్ళీ ఏ తెలుగు సినిమాలో లయ నటిస్తారో చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

laya picnic trip with family
laya picnic trip with family

ప్ర‌స్తుతం ల‌య త‌న ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసిన‌ట్టు క‌పిపిస్తుంది. ఈ ట్రిప్‌లో ల‌య ఫ్యామిలీ క‌లిసి ఓ పిక్ దిగ‌గా ,ఈ పిక్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇక్కడ వారంద‌రు డ్రెస్సింగ్ కోడ్ పాటించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ల‌య ఫ్యామిలీ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.