Lawrence : లారెన్స్ సూపర్ హిట్ సీక్వెల్ లో శరత్ కుమార్.. ఇదొక్కటే షాకింగ్ డేసిషన్ ..?

Lawrence : లారెన్స్ కి బాగా కలిసొచ్చిన జోనర్ హర్రర్ బ్యాక్ డ్రాప్. ముని తో మొదలైన రాఘవ లారెన్స్ కాంచన 2 వరకు వరస బెట్టి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ముని సీక్వెల్స్ గా వచ్చిన కాంచన, గంగ, కాంచన 2, కాంచన 3, శివలింగ .. ఇలా అన్ని ఇదే జోనర్ లో తెరకెక్కి సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇక కాంచన సినిమాని రీసెంట్ గా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో లక్ష్మీ అన్న టైటిల్ తో తీశాడు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అయి హిట్ సాధించాయి. కొరియో గ్రాఫర్ గా .. దర్శకుడిగా లారెన్స్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి స్టార్ డం ని తెచ్చుకున్నాడు.

lawrence-sharath-kumar-in-lawrence-super-hit-sequal-this-is-one-of-the-shcoking-decisiion
lawrence-sharath-kumar-in-lawrence-super-hit-sequal-this-is-one-of-the-shcoking-decisiion

కాగా ఇదే తరహా కథాంశం తో మరోసారి రాబోతున్నాడు రాఘవ లారెన్స్. ఈ సినిమా ‘రుద్రన్’ అన్న టైటిల్ తో తెరకెక్కుతుండగా ఇంకా తెలుగులో ఏ టైటిల్ తో తీసుకు వస్తారో తెలియాల్సి ఉంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముని సీక్వెల్స్ అన్నిటికీ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాని ఈ లేటెస్ట్ సినిమాకి మాత్రం లారెన్స్ దర్శకత్వం వహించడం లేదు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కార్తిరేసన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి లారెన్స్ దర్శకుడు కాకపోవడం కాస్త షాకింగ్ విషయం అంటున్నారు.

Lawrence : ఇలాంటి పాత్ర చేయడం అంటే పెద్ద సాహసం..!

కాగా ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. 2011 లో వచ్చిన కాంచన సినిమాలో శరత్ కుమార్ – లారెన్స్ కలిసి నటించారు. ఈ సినిమాలో శరత్ కుమార్ ట్రాన్స్ జెండర్ పాత్రలో అద్భుతంగా నటించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇలాంటి పాత్ర చేయడం అంటే పెద్ద సాహసం. కాని ఆ సహాసాన్ని శరత్ కుమార్ చేసి గొప్ప పేరు సాధించాడు. కాగా మళ్ళీ ఇన్నేళ్ళకి శరత్ కుమార్ – లారెన్స్ కలిసి నటిస్తుండటం అభిమానులకి సర్‌ప్రైజింగ్ గా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లారెన్స్ జంటగా టాలెంటెడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement