Salman Khan : సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పకుంటే చంపేస్తా.. లైవ్ లోనే లారెన్స్ వార్నింగ్..!
NQ Staff - March 16, 2023 / 11:51 AM IST

Salman Khan :బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. ఇప్పటికీ సింగిల్ గానే ఉన్న ఆయన.. చేసే పనులు కూడా తీవ్ర వివాదంగా మారుతుంటాయి. కొన్ని సార్లు చేసే కామెంట్లు కూడా విమర్శలకు తావిస్తుంటాయి. ఇక అప్పట్లో ఆయన కృష్ణ జింకలను వేటాడిన కేసు ఎంత పెద్ద దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే.
అయితే ఇప్పటికీ ఆయన్ను ఈ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగకు ఆరాధ్యదైవం. అయితే ఈ తెగకు చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం కూడా చేశాడు. దాంతో లారెన్స్ ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు.
అక్కడే చంపేస్తా..
ఇక జైల్లో ఉండి కూడా సల్మాన్ మీద కోపాన్ని ప్రదర్శించాడు లారెన్స్. ఆయన రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ మీద మా తెగ వారు కోపంగా ఉన్నారు. ఆయన మమ్మల్ని, మా దైవాన్ని అవమానించాడు. సల్మాన్ ఖాన్ ను జోధ్ పూర్ లోనే చంపేస్తా.
సల్మాన్ ను వదిలి పెట్టాలంటే ఆయన మా కులదైవాన్ని దర్శించుకుని మా వారికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే వదిలేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు బిష్ణోయ్. ఆయన చేసిన వార్నింగ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. గతంలో ఈయన బెదిరింపుల కారణంగానే సల్మాన్ కు సెక్యూరిటీని పెంచేసింది ప్రభుత్వం.