Lavanya Tripathi : ఎంగేజ్ మెంట్ లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర తెలిస్తే షాకే..!

NQ Staff - June 12, 2023 / 09:33 AM IST

Lavanya Tripathi : ఎంగేజ్ మెంట్ లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర తెలిస్తే షాకే..!

Lavanya Tripathi : మామూలుగానే సెలబ్రిటీలు చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటారు. మనం నెలంతా కష్టపడి సంపాదించినా సరే వారు వేసుకునే బట్టల ఖరీదు అంత కూడా ఉండదు. అందుకే వారిది లగ్జరీ లైఫ్ అని అంతా అంటుంటారు. ఇక వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మొన్న జూన్ 9న ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.

కానీ ఇన్ని రోజులు ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఎన్ని రూమర్లు, వార్తలు వచ్చినా సరే సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఇరువురి కుటుంబాల నడుమ వీరిద్దరూ సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే ఈ ఎంగేజ్ మెంట్ లో లావణ్య కట్టుకున్న చీర ధరను కొందరు గూగుల్ లో వెతకగా షాకింగ్ రేట్ కనిపించింది.

ఈ ఎంగేజ్ మెంట్ లో వరుణ్‌ తేజ్, లావణ్య సంప్రదాయ బట్టల్లో కనిపించారు. వరుణ్ తేజ్ కుర్తా ఫైమాజా ధరిస్తే.. లావణ్య ఆకుపచ్చ రంగు బనారస్ చీరను కట్టుకుంది. కాగా ఈ చీర ధర అక్షరాల రూ.75 వేలు. అనితా డోంగ్రే అనే ఫ్యాషన్ డిజైనర్ దీన్ని డిజైన్ చేశారట. మెగా కోడలు రేంజ్ కు ఇది కూడా తక్కువే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కానీ మరికొందరు మాత్రం ఎంగేజ్ మెంట్ కే ఇంత ఖరీదైన చీర కట్టుకుంటే.. ఇక పెళ్లికి ఇంకెంత ఖరీదైన చీర కట్టుకుంటుందో అని ఆశ్చర్యపోతున్నారు. కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. లావణ్య కూడా అటు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us