Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో పెండ్లిపై స్పందించిన లావణ్య త్రిపాఠి.. పరువు తీసేసిందిగా..!
NQ Staff - March 4, 2023 / 11:40 AM IST

Lavanya Tripathi : వరుణ్ తేజ్ ఇప్పుడు సినిమా రంగంలో చాలా బిజీ అయిపోయాడు. ఆయన మొదటి నుంచి చాటా డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేసేందుకు ఇష్టపడుతున్నాడు. ఏదో కమర్షియల్ సినిమా చేయాలని ఆలోచన ఆయనకు లేదు. జనాలకు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ప్రమోషన్ లో భాగంగా..
ఇలా సినిమాల పరంగానే కాకుండా ఆయన పేరు ఈ మధ్య లావణ్య త్రిపాఠి కారణంగా బాగా ఫేమస్ అయిపోయింది. లావణ్య త్రిపాఠితో ఆయన పెండ్లి అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా లావణ్య త్రిపాఠి నటించిన పులి-మేక వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Lavanya Tripathi Reacts Of Love Affair with Varun Tej
దాంతో ఆమె ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను పెండ్లి గురించి అడిగారు. దాంతో ఆమె చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. మీ దృష్టిలో ఇండస్ట్రీకి వచ్చిన పదేండ్లలోపు పెండ్లి చేసుకోవాలి అంతేనా.. నాకు అయితే ఇప్పుడు పెండ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.
నేను ఎవరినీ పెండ్లి చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా లేను అంటూ రూమర్లను కొట్టి పడేసింది. కాగా వరుణ్ తేజ్ తో రూమర్లపై ఇంత ఘాటుగా స్పందించింది అంటే ఆ హీరోను అవమానించడమే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.