Lavanya Tripathi : ఆమె వల్లే స్టార్ హీరోయిన్ కాలేకపోయా.. లావణ్య త్రిపాఠి ఎమోషనల్..!

NQ Staff - June 1, 2023 / 12:09 PM IST

Lavanya Tripathi : ఆమె వల్లే స్టార్ హీరోయిన్ కాలేకపోయా.. లావణ్య త్రిపాఠి ఎమోషనల్..!

Lavanya Tripathi : సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే.. వచ్చిన వాటిని వినియోగించుకుని స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం మరో ఎత్తు. అందుకే కేవలం కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటారు. ఇలాంటి వారి లిస్టులో లావణ్య త్రిపాఠి కూడా ఉంటారు. ఆమెకు చాలా అకవాశాలు వచ్చాయి.

కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావట్లేదు. ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కొట్టలేదు. అదే ఆమెకు మైనస్ పాయింట్ అయిపోయింది. కాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్మిక వల్లే తాను స్టార్ హీరోయిన్ కాలేకపోయానంటూ తెలిపింది.

వాస్తవంగా గీతా గోవిందం సినిమాలో ముందుగా తననే అడిగారంట. కానీ విజయ్ దేవరకొండ సినిమా కావడంతో తాను ఆలోచించుకోవడానికి టైమ్ అడిగిందంట. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాలో లాగా లిప్ లాక్ లు ఉంటాయోమే అని ఆలోచించి చెప్తా అని టైమ్ తీసుకుందంట. కానీ ఈలోగా రష్మిక గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసిందంట.

Lavanya Tripathi Made Shocking Statements Because Of Rashmika Mandanna

Lavanya Tripathi Made Shocking Statements Because Of Rashmika Mandanna

తాను ఆ సినిమాలో నటించేందుకు రెడీ అంటూ చెప్పడంతో.. హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ కాబట్టి అల్లు అరవింద్ కూడా వెంటనే ఓకే చేశారంట. పైగా లిప్ లాక్ లకు కూడా రెడీ అనేసరికి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఆ మూవీ పెద్ద హిట్ కావడం.. అప్పటి నుంచే రష్మికకు స్టార్ హీరోల సినిమాల్లో, పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమాను తాను చేసి ఉంటే ఈరోజు రష్మిక ప్లేస్ లో ఉండేదాన్ని అంటూ ఎమోషనల్ అయింది లావణ్య.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us