Varun Tej And Lavanya Tripathi : లావణ్య-వరుణ్ మధ్య ప్రేమకు కారణం ఆ డైరెక్టరే.. ఎంత పని చేశాడు..?
NQ Staff - June 2, 2023 / 09:18 AM IST

Varun Tej And Lavanya Tripathi : ఇప్పుడు టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెండ్లి వార్త ఊపేస్తోంది. ఈ నెల 9న వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు.
కానీ రీసెంట్ గా ఇరు కుటుంబాల నడుమ ఒప్పందం కూడా జరిగిపోయినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ కూడా వరుణ్ ప్రేమను కాదనలేక ఒప్పుకుందంట. ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కాగా వీరిద్దరి ప్రేమకు ఓ డైరెక్టర్ కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా..
ఆయనేనండి శ్రీను వైట్ల. అవును ఇప్పుడు శ్రీనువైట్ల మీద చాలా రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీనువైట్ల గతంలో 2017లో ‘మిస్టర్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో లావణ్య, వరుణ్ కలిసి నటించారు. వీరిద్దరూ ఈ సినిమతోనే పరిచయం అయ్యారు. అప్పుడే ఇద్దరి నడుమ ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది.

Lavanya Tripathi Is Getting Engaged Varun Tej
ఇలా వీరిద్దరినీ కలిపిన క్రెడిట్ ను కొట్టేశాడు శ్రీను వైట్ల. దాంతో ఆయన మీద కొందరు ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. ఎంత పని చేశావు శ్రీను వైట్ల అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీ ఇద్దరినీ కలిపినందుకు అయినా శ్రీనువైట్లతో మీరు మరో సినిమా చేయాలని వరుణ్ కు రిక్వెస్టులు పెడుతున్నారు.