Lavanya tripathi : లావణ్య త్రిపాఠి .. అందుకు సై అందంటే ఇక టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ కొట్టేసినట్టే ..?

Lavanya tripathi : లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. మొదటి సినిమా మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. రాజమౌళి లాంటి దర్శకులతో ప్రశంసలు అందుకుంది. మంచి హిట్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో పాటు వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించి మెప్పిస్తోంది లావణ్య త్రిపాఠి. లాక్ డౌన్ కి ముందు యంగ్ హీరో నిఖిల్ కి జంటగా నటించిన అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకుంది.

lavanya-tripathi-if-she-says-yes-to-this-then-she-will-be-in-top-place-in-tollywood
lavanya-tripathi-if-she-says-yes-to-this-then-she-will-be-in-top-place-in-tollywood

ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలలో నటిస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక లావణ్య త్రిపాఠి కి మరికొన్ని సినిమాలలో వరసగా అవకాశాలు వస్తాయని చెప్పుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అటు సీనియర్ హీరోలకి.. ఇటు యంగ్ హీరోలకి సూటయ్యే పర్సనాలిటి. ఇప్పుడు లావణ్య కి టాలీవుడ్ లో అవకాశాలు రావడానికి ఇదే కలిసొచ్చే అంశం.

Lavanya tripathi : ఇలాంటి ఆఫర్ ఇస్తే గ్యారెంటీగా మేకర్స్ క్యూ కట్టడం ఖాయం అంటున్నారు.

అంతేకాదు ఈ మధ్య లావణ్య త్రిపాఠి పిచ్చ హాట్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫొటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఇక మేకర్స్ కూడా లావణ్య లేటెస్ట్ ఫొటో షూట్స్ కి ఫిదా అవుతున్నారట. ఇప్పుడు కొత్తగా మొదలయ్యే ప్రాజెక్ట్స్ కి లావణ్య పేరు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు లావణ్య మేకర్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. సీన్ డిమాండ్ చేస్తే బికినీ లో కనిపించడానికి సై అంటుందట. ఇలాంటి ఆఫర్ ఇస్తే గ్యారెంటీగా మేకర్స్ క్యూ కట్టడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి లావణ్య త్రిపాఠి కి ఏ ఆఫర్స్ వస్తాయో.

Advertisement